బాహుబ‌లి కంటే ట్రిపుల్ ఆర్ ఎక్కువా అదెలా?

Update: 2022-04-21 05:19 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం 'ట్రిపుల్ ఆర్' మార్చి 25న విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇద్ద‌రు స్టార్ హీరోల పాత్ర‌ల‌ని మ‌రింత ప్ర‌భావ వంతంగా ఆవిష్క‌రించిన తీరు, ఇద్ద‌రిపై చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమాపై విమ‌ర్శ‌ల‌కుతో పాటు ప్రేక్ష‌కులు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాసిన ఈ మూవీ ఇటీవ‌లే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన విష‌యం తెలిసిందే. 'కేజీఎఫ్ 2' రిలీజ్ త‌రువాత కొన్ని ఏరియాల్లో జోరు త‌గ్గినా ఇప్ప‌టికే ఇత‌ర సెంట‌ర్ల‌లో ట్రిపుల్ ఆర్ హ‌వా కొన‌సాగుతూనే వుంది. ఇప్ప‌టికే పీకెతో పాటు ప‌లు బాలీవుడ్ క్రేజీ చిత్రాల రికార్డ్స్ ని తిర‌గ‌రాసి సంచ‌ల‌నం సృష్టించింది. ఫ్యాన్స్ మ‌ధ్య మా హీరో పాత్ర ని త‌క్కువ చేశారంటే మా హీరో పాత్ర‌ని త‌క్కువ చేశార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ న‌డుస్తున్నా సినిమా మాత్రం త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగిస్తూ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.

ఇదిలా వుంటే ఈ చిత్రంపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశారు. ఇటీవ‌లే ఓ యూట్యూబ్ మీడిమ‌యాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రిపుల్ ఆర్ తో పాటు బాహుబ‌లి 2పై స్పందించారు. యుఎస్ ప్రేక్ష‌కులు బాహుబ‌లి 2 కంటే ట్రిపుల్ ఆర్ పైనే అత్య‌ధికంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించార‌న్నారు.

అంతే కాకుండా ట్రిపుల్ ఆర్ ని మించి బాహుబ‌లి భారీ విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకు మించి ట్రిపుల్ ఆర్ సినిమాని యుఎస్ ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ట్రిపుల్ ఆర్ తో పోలిస్తే 'బాహుబ‌లి 2'కు ల‌భించిన ప్ర‌శంస‌లు చాలా త‌క్కువ‌.

విమ‌ర్శ‌లే ఎక్కువ అని స్ప‌ష్టం చేశారు. మార్వెల్ డీసీ సూప‌ర్ హీరో మూవీస్ ని అమితంగా ఇష్ట‌ప‌డే యుఎస్ ప్రేక్ష‌కులు ట్రిపుల్ ఆర్ లోని అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం పాత్ర‌ల‌ని కూడా అదే త‌ర‌హాలో ఊహించుకుని అనుభూత‌ని పొందార‌ని, వీరిద్ద‌రిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని యుఎస్ ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేశార‌ని చెప్పుకొచ్చారు. ట్రిపుల్ ఆర్ యుస్ లో 14 మిలియ‌న్స్ ని క‌లెక్ట్ చేసింది. బాహుబ‌లి 2 అన్ని భాష‌ల్లో క‌లిపి 20 మిలియ‌న్ క్రాస్ చేసింది.

ఈ రెండు చిత్రాల‌కు రాజ‌మౌళి బ్రాండ్ వ్యాల్యూ బాగా క‌లిసొచ్చింది. అంతే కాకుండా బాహుబ‌లి 2 పై ప్రేక్ష‌కుల్లో క్రేజ్ ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం 'బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు' అన్న ప్ర‌శ్న‌. దీని కార‌ణంగానే పార్ట్ 2 పై ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి ఏర్ప‌డింది. అదే సినిమాకు ప్రధాన బ‌లంగా మారి సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని చేసింది. త్వ‌ర‌లో మ‌హేష్ తో రాజ‌మౌళి చేయ‌నున్న సినిమా ట్రిపుల్ ఆర్‌, బాహుబ‌లి 2 రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందా?  లేదో తెలియాలంటే 2024 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News