స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందా? అంటే అవుని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్యతో విడాకుల తరువాత నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తోంది సమంత. టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ జోడీగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య - సమంల అనూహ్యంగా విడిపోతున్నామంటూ ప్రకటించడంతో యావత్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక ఇష్యూ కారణంగా సోషల్ మీడియా వేదికగా సమంత వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
చైతో విడిపోయిన సందర్భంలో నెటిజన్ ల నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొన్న సామ్ ఆ తరువాత కొంత కాలం సైలెంట్ గా వుంది. ఆధ్యాత్మక టూర్ కి వెళ్లొచ్చాక మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ తనని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తూ వచ్చింది. వాతావరణం కూల్ కావడంతో తిరిగి వరుస సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. సినిమాల్లో నటిస్తూనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేనేత వస్త్రాలకు సమంత ప్రచార కర్తగా మారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'శాకుంతలం'లో నటించిన సామ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఇతర ప్రాజెక్ట్ లపై దృష్టిపెట్టింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'యశోద', విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ రూపొందిస్తున్న 'ఖుషీ' చిత్రాలలో నటిస్తూ మరో రెండు భారీ ప్రాజెక్టలలో నటించబోతోంది.
'యశోద' బైలింగ్వల్ గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే తనకు 'ఫ్యామిలీ మ్యాన్ 2'తో నేషనల్ వైడ్ గా గుర్తింపుని తెచ్చిపెట్టిన రాజ్ ఎన్ డీకెలతో మరో వెబ్ సిరీస్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ మూవీ కోసం గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా వుంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సమంత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా చెబుతున్నారు.
సామ్ సినిమాల్లో నటిస్తూనే బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోదీకి తాను సపోర్టర్ నని బాహాటంగానే వెల్లడించిన సామ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
ఇటీవల బీజేపీ లీడర్లు వరుసగా సినిమా స్టార్లని కలుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో ఎన్టీఆర్ ని అమితాషా కలవగా, జేపీ నడ్డా తో నితిన్ ప్రత్యేకంగా సమావేశం కావడం తెలిసిందే. త్వరలో సమంత కూడా బీజేపీ నేతలతో భేటీ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే సామ్ భేటీ వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.