మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ తో వున్నాడు. 'క్రాక్' తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన రవితేజ మధ్యలో రెండు భారీ దెబ్బలు తిన్నా రీసెంట్ గా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో చేసిన 'ధమాకా'తో ధమాకా హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ మూవీతో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని ఔరా అనిపించాడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం విశేషం. ఈ మూవీ అందించిన జోష్ తో వున్న రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీలో నటిస్తున్నాడు.
స్టూవర్ట్ పురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో టైటిల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ది కశ్మీర్ ఫైల్స్', కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.
బాలీవుడ్ క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తుండగా దాదాపు 18 ఏళ్ల విరామం తరువాత రేణు దేశాయ్ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. 1970వ దశకంలో స్టూవర్ట్ పురంలోని గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్ 'హేమలతా లవణంగా కనిపించనుంది. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ హైదరాబాద్ లో మొదలైంది.
భారీ స్థాయిలో రవితేజ పాల్గొనగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లని తాజాగా పూర్తి చేశారు. దీంతో సినిమాకు సంబంధించిన అత్యంత కీలకంగా నిలిచే తాజా షెడ్యూల్ పూర్తయింది. ఇదే విషయాన్ని మేకర్స్ గురువారం వెల్లడిస్తూఆన్ లొకేషన్ కు సంబంధించిన ఓ స్టిల్ ని విడుదల చేశారు. టైగర్ హంట్ లోడింగ్ అంటూ చిత్ర బృందం విడుదల చేసిన స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతికి టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే 'టైగర్ హంట్ లోడింగ్ స్టే ట్యూన్డ్'అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. అంటే సంక్రాంతి రోజున మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కి ఫెస్టివెల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ లో ఆ మధ్య రవితేజ గాయపడటం..'నో రోస్ట్' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం తెలిసిందే. తెలుగుతో పాటు ఈ మూవీని తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.