నందమూరి నటసింహం బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ కంప్లీట్ చేసిన వెంటనే, బాలయ్య ఈ సినిమా స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఈ ఏడాది ప్రారంభంలో రవితేజతో 'క్రాక్' వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు లీడ్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న గోపీచంద్ కి హీరోయిన్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ సరసన హీరోయిన్ కోసం గోపీచంద్ వేట సాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'క్రాక్' మూవీలో మెప్పించిన శ్రుతిహాసన్ ను బాలయ్య సినిమాలో హీరోయిన్ రోల్ కోసం సంప్రదించారట. అయితే ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న శృతి హాసన్.. బాలయ్య సినిమా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట. నిజానికి 'బీబీ3' సినిమాకు కూడా చాలా రోజులు హీరోయిన్ సమస్య వెంటాడింది. ఎట్టకేలకు 'అఖిల్' ఫేమ్ సహేషా సైగల్ - 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ - పూర్ణ లను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. ఇప్పుడు బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో రాబోయే సినిమాకి కూడా హీరోయిన్ సమస్యలు తప్పడంలేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.