శుక్రవారం వస్తుందంటే చాలు.. కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ శుక్రవారం కూడా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే పెద్దగా హడావుడి లేకుండా.. ప్రమోషన్స్ జోరు లేకుండా విడుదల అవుతూ ఉండడంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమాల గురించి తెలియదు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒకటి నాగశౌర్య 'అశ్వథ్థామ'.. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి డెబ్యూ ఫిలిం 'చూసి చూడంగానే'.
ఈమధ్య ప్రమోషన్స్ లో శ్రద్ద వహించక పోవడంతో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. దీనికి కారణం మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ప్రచారం చెయ్యకుండా సోషల్ మీడియా ప్రచారంతో సరిపెట్టడమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రేక్షకులకు ఈ ప్రచారం తో సినిమాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది కానీ సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాధారణ ప్రేక్షకులకు మాత్రం సినిమాల గురించి తెలియడం లేదు. నాగశౌర్య ఈ పొరపాటు చేయకుండా ప్రమోషన్స్ పట్ల శ్రద్ధ వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈమధ్య శౌర్య వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. 'అశ్వథ్థామ' సినిమాపైనే తన నమ్మకం పెట్టుకున్నాడు.
ఈ సినిమకు శౌర్య స్వయంగా కథ కూడా అందించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. అశ్వథ్థామ = రాక్షసుడు + సరైనోడు.. ఈ గణిత సమీకరణం అర్థం అయింది కదా. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'రాక్షసుడు' సినిమా ఒక సీరియల్ కిల్లర్ చేసే హత్యలపై సాగుతుంది. ఈ కాన్సెప్ట్ కు అల్లు అర్జున్ 'సరైనోడు' మాస్ యాక్షన్ జోడించి 'అశ్వథ్థామ' కథను వండారని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా తెలియాలంటే మాత్రం శుక్రవరం వరకూ వేచి చూడాలి.