సుధీర్ బాబు మళ్లీ అదే సినిమాతో వస్తున్నాడా..?

Update: 2022-03-19 15:30 GMT
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సుధీర్ బాబు. కెరీర్ ప్రారంభం నుంచీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కృషి చేస్తున్నారు. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. హిట్ ఫ్లాప్‌ ల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు.

ఇప్పుడు సుధీర్ బాబు చేతిలో ఉన్న సినిమాలలో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుర్ర భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో 'సమ్మోహనం' తరహా కాన్సెప్ట్ తోనే 'ఆ అమ్మాయి..' సినిమా రూపొందుతోందనే సందేహాలు కలిగించింది. నాలుగేళ్ల కింద సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం' సినిమా మంచి విజయం సాధించింది.

అందులో 'సినిమా నేపథ్యం' తీసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ ని బట్టి.. ఇందులోనూ అదే బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చెప్పబోతున్నాడని తెలుస్తుంది. హీరో సుధీర్ బాబు ఫిలిం డైరెక్టర్ గా.. కృతి శెట్టి అప్ కమింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే అప్పుడు సక్సెస్ అయిందని అదే కాన్సెప్ట్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా అని ఫిల్మ్ నగర్‌ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

'ఆ అమ్మాయి..' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్‌ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు ఈ సినిమాకి సమర్పకులు.

వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా.. పి జి విందా సినిమాటోగ్రఫీ అందించారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
Tags:    

Similar News