సుశాంత్‌ కేసు తప్పు దారిన వెళ్తోందా?

Update: 2020-09-06 10:30 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ కుమార్‌ మృతి కేసును సీబీఐ వారు విచారిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని అంతా ఆశించారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులు రియాపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ఆమె మృతికి కారణం అంటూ వాదిస్తున్నారు. సుశాంత్‌ నుండి భారీగా డబ్బులు లాగడంతో పాటు అతడి ఆరోగ్యం చెడిపోవడంకు కూడా కారణం అయ్యింది అంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సీబీఐ వారు అదే తరహాలో ఎంక్వౌరీ సాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

ముఖ్యంగా ఈ కేసుకు డ్రగ్స్‌ కు సంబంధం ఉందంటూ సీబీఐ నిర్ణయానికి వచ్చింది. విచారణలో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. రియా వద్ద డ్రగ్స్‌ డీలర్‌ నెంబర్‌ లభ్యం అవ్వడంతో పాటు ఆమె డ్రగ్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు లభించాయట. రియా సోదరుడు కూడా విచారణలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకోవడంతో ఆయన్ను అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో రియా మరియు సుశాంత్‌ లు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుశాంత్‌ మృతి చెందిన తర్వాత ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం దారుణం అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ కు ఇప్పుడు డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉందని ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదంటూ ఆయన అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. సుశాంత్‌ విషయంలో రియాకు కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు అభిమానులను కలవర పెడుతున్నాయి.
Tags:    

Similar News