బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్, నటి సప్నాచౌదరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె చేయాల్సిన షోను రద్దు చేసి ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఆమె పై వచ్చిన ఆరోపణలను విచారించిన, కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శంతను త్యాగి తదుపరి విచారణలో ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. దీనితో కేసుకి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది లక్నో కోర్టు.
2018 అక్టోబర్ 14, 2018న, లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్ లో డాన్సర్ సప్నా చౌదరిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. ఆ కంప్లైట్‌లో అక్టోబర్ 13, 2018న లక్నోలోని స్మృతి ఉప్వాన్, లక్నోలో షో కోసం ఏర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి వరకు సప్నా చౌదరి కార్యక్రమానికి రాకపోవడంతో షో రద్దైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ షో కోసం రూ.300 చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసి, ప్రదర్శనకు వచ్చిన వేలాది మందికి ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసులో ఈ బ్యూటీతో పాటు షో ఆర్గనైజర్స్ జునైద్ అహ్మద్, నవీన్ శర్మ, ఇవాద్ అలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్ పేర్లు కూడా ఉన్నాయి.