ఎనర్జిటిక్ స్టార్ హీరో ఉస్తాద్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `ది వారియర్`. మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న ఎన్. లింగుస్వామి ఈ మూవీని రూపొందించారు. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఫామ్ ని కోల్పోయిన లింగుస్వామి `ది వారియర్` మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టాలన్న కసితో చేసినట్టుగా తెలుస్తోంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ లతో ఇప్పటికే మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
మరి కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత రామ్ తన నెక్స్ట్ మూవీని మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ తో పాటు రామ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్ట్ ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇటీవల జరిగిన `ది వారియర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నానంటూ దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పవర్ స్టార్ తో హరీష్ శంకర్ `భవదీయుడు భగత్ సింగ్` ప్రాజెక్ట్ ని చేయాలని గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీ కోసం హరీష్ శంకర్ తరహాలోనే మైత్రీ మూవీ మేకర్స్ ఎదురుచూస్తోంది. అయితే పవన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో వుంటుందా? .. వుండదా? అనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ త్వరలో జనసేన పార్టీ ప్రచారం కోసం వచ్చే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ నుంచి ఏపీ అంతటా పవన్ బస్ యాత్రకు వెళ్లబోతున్నారు.
దీంతో `భవదీయుడు భగత్ సింగ్` ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం కావడంతో దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ వర్గాలు పవన్ కల్యాణ్ ని `ది వారియర్` ప్రీ రిలీజ్ వెంట్ కి ముందు కలిశారట. తనదో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ప్రసక్తిలేదని, ఈ సమయంలో కొత్త ప్రాజెక్ట్ ని రామ్ తో స్టార్ట్ చేయమని హరీష్ శంకర్ తో చెప్పారట. పవన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడం వల్లే హరీష్ శంకర్ `ది వారియర్` ఈ వెంట్ సాక్షిగా రామ్ తో సినిమా చేయబోతున్నానని ప్రకటించినట్టుగా తెలుస్తోంది.
త్వరలోనే స్టోరీ నరేట్ చేయబోతున్నారట. బోయపాటితో పాన్ ఇండియా సినిమాకు రెడీ అయిపోతున్న రామ్ ఈ మూవీ తరువాతే హరీష్ వంకర్ ప్రాజెక్ట్ కు డేట్స్ కేటాయిస్తారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానపుంది. తెలిసింది.