కరోనా లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఎప్పటిలాగే బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అయితే క్రైమ్ ఇన్వెస్టీగేషన్ - జైలు బ్యాక్ డ్రాప్ - ఇంట్రాగేషన్లు - పోలీసు కథలతో ఎక్కువ సినిమాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ రెండు నెలల్లో విడుదలైన సినిమాలు అన్నీ దాదాపు ఇదే ఫార్మాట్ లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి.
'క్రాక్' సినిమాతో ఇండస్ట్రీని రీసార్ట్ చేసిన కథ ఒక పోలీస్ స్టోరీ అవ్వడం విశేషం. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఆ తర్వాత వచ్చిన దళపతి విజయ్ - విజయ్ సేతుపతి నటించిన 'మాస్టర్' సినిమా కూడా జైలు నేపథ్యంలో ఉంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
అలానే ఉస్తాద్ రామ్ నటించిన 'రెడ్' సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా ఎక్కువ భాగం జైలులోనే జరుగుతుంది. ఇక అల్లరి నరేష్ ఈసారి తన పంధా మార్చి నటించిన 'నాంది' సినిమా కూడా జైలు బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొత్త పాయింట్ ని తీసుకొని విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. విశాల్ హీరోగా ఈ మధ్య విడుదలైన 'చక్ర' సినిమా కూడా సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందింది.
యూత్ స్టార్ నితిన్ నటించిన 'చెక్' సినిమా మొత్తం జైలు బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఉరి శిక్ష పడిన ఓ వ్యక్తి జైలు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఇందులో చూపించారు. ఇలా ఈ మధ్య విడుదలైన సినిమాలన్నీ కూడా జైల్లు, క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలే కావడం విశేషం. అయితే ఈ నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం కంటెంట్ కి కమర్షియాలిటీ జోడించిన సినిమాలకే ఓటు వేస్తున్నారు. 'క్రాక్' బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో వసూళ్ళు రాబట్టడానికి కారణం ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటమే. ఇక త్వరలో రాబోతున్న 'వకీల్ సాబ్' కూడా ఓ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డ్రామానే. మరి ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని మెప్పించే రేంజ్ లో జోడించారో లేదో చూడాలి.