ఆ దిగ్గ‌జాలిద్ద‌రి మ‌ధ్య పోలిక స‌హేత‌క‌మేనా?

Update: 2022-07-22 02:30 GMT
ఒక‌ప్పుడు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఎవ‌రంటే?  మ‌ణిర‌త్నం..శంక‌ర్ పేర్లే వినిపించేవి. సినిమా చ‌రిత్ర‌ని మార్చిన ద‌ర్శ‌కులు గా ఇండియ‌న్ సినిమానే భావిస్తుంది. వీళ్లిద్ద‌రితో పాటు రాంగోపాల్ వ‌ర్మ‌ని కూడా ఈ జాబితాలో చేర్చాలి. ఈ ముగ్గురు  దిగ్గ‌జాల కార‌ణంగానే  భార‌తీయ సినిమా స్థాయి మారింద‌న్న‌ది  నర్మ‌గ‌ర్భంగా ఒప్పుకోవాల్సిన వాస్త‌వం.

ఆర్ట్ సినిమాకి-క‌మర్శియ‌ల్ సినిమాకి మ‌ధ్య‌లో ఉన్న గీత‌ని చెరిపేసిన త్ర‌యం ఇది. ఆర్ట్ సినిమాల్లో ఉండే సెన్సిబిలిటీస్ ని   క‌మ‌ర్శియ‌ల్ సినిమాల్లో జొప్పించడంతో ఆ రెండిటి మ‌ధ్య ఉన్న గీత చెరిగిపోయింది. ఈ కోవ‌లో ఈ త్ర‌యం ఎన్నో స‌క్సెస్ లు అందుకుంది. స‌రికొత్త విజ‌యాలు అందుకున్న దిగ్గ‌జాలుగా ఖ్యాతికెక్కారు. చెప్పే విష‌యాన్ని అద్భుత‌ర‌సంలో  చెప్ప‌డం అన్న‌ది ఈ త్ర‌యం అనుస‌రించిన ప‌ద్ద‌తిగా చెప్పొచు.

అయితే ఈ రైలు  నుంచి మొట్ట మొద‌టిగా దిగిపోయిన వారు రాంగోపాల్ వ‌ర్మ. అటుపై శంక‌ర్.. ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నం ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. అదే స‌మ‌యంలో ఈ ముగురితో  సుజాత అనే ర‌చ‌యిత దిగ్గ‌జం ట్రావెల్ అయ్యేవారు. ఆయ‌న  మ‌ర‌ణంతోనే ఈ ముగ్గురికి వ‌రుస ఫెయిల్యూర్స్ మొద‌ల‌య్యాయని చాలా మంది చెప్పే మాట‌.

స‌మ‌ర్ధులైన ర‌చ‌యిత‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల వీళ్లంతా స‌రైన హిట్లు ఇవ్వ‌డం  లేద‌ని ఆ నాడే గ‌మ‌నించారంతా. ఇప్ప‌టికీ ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. స‌రైన క‌థ‌లు ప‌డితే ఈ త్ర‌యం విశ్వ‌రూపం చూపిస్తార‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.  అయితే కాలం తెచ్చిన మార్పుల్లో ఈ ముగ్గురు ఎంతో వెనుక‌బ‌డ్డారు. వ‌రుస ప‌రాజ‌యాలు రేసులో వెనక్కి నెట్టిన మాట వాస్త‌వం.

ఆ త‌ర్వాతి కాలంలో `బాహుబ‌లి` విజ‌యంతో పాన్ ఇండియా ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి ఫేమ‌స్ అయ్యారు.  ఇటీవ‌లే `ఆర్ ఆర్ ఆర్` విజ‌యంతో జ‌క్క‌న్న పేరు మ‌రోసారి దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అజ‌య‌మెరుగ‌ని దర్శ‌కుడిగా జక్క‌న్న ఇండియాన్ మార్కెట్ లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయ‌న‌కంటూ  ఓ బ్రాండ్ క్రియేట్ అయింది.

వెనుక తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ లాంటి దిగ్గ‌జ ర‌చ‌యిత ఉండ‌టంతోనే జ‌క్క‌న్న ఇవ‌న్నీ సాధించ‌గ‌లిగారు. భ‌విష్య‌త్ లో మ‌రిన్న సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తారు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.  అయితే  నెట్టింట రాజ‌మౌళి-మ‌ణిర‌త్నం సినిమాల్ని ఉద్దేశించి ట్రోలింగ్ చేయ‌డ‌మే ఇంత‌టి చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం `పొన్నియ‌న్ సెల్వ‌న్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్  తో `బాహుబ‌లి` త‌ర‌హా సినిమా సెట్ల‌ను పోలి ఉంద‌ని.. జ‌క్క‌న్న‌ని మ‌ణిస‌ర్  కాపీ కొడుతున్నార‌ని  ట్రోలింగ్ జ‌రుగుతోంది.  అయితే ఇది  ఎంత మాత్రం స‌హేతుకం కాద‌న్న‌ది నిపుణుల అభిప్రాయం. వీళ్లిద్ద‌రి మ‌ధ్య కంపారిజ‌న్ అన్న‌దే త‌ప్పుడు ఆలోచ‌న‌గా  భావిస్తున్నారు. మ‌ణిర‌త్నం...శంక‌ర్ లాంటి దిగ్గ‌జాలు తీసిన సినిమాల స్ఫూర్తితో సినిమాలు చేస్తోన్న జ‌క్క‌న్న‌ని వాళ్ల‌తో పోల్చ‌డం భావ్యం కాదంటున్నారు.

రేసులో లేక‌పోయినా..చ‌రిత్ర‌ని తిర‌గేస్తే వాస్త‌వాలు తెలియ‌వా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. `క‌ల్కి కృష్ణ‌మూర్తి` న‌వ‌ల‌ల ప్ర‌భావం విజ‌యేంద్ర ప్ర‌సాద్ పై తీవ్రంగా ఉంటుంద‌ని... హిస్టారిక‌ల్  ఫిక్ష‌న్ సినిమాలు ఎవ‌రు చేసినా ఎవ‌రి ప్రేర‌ణ‌లు వాళ్ల‌కుంటాయ‌న్న‌ది గుర్తించాల్సిన అంశంగా చెప్పుకొస్తున్నారు.

`బాహుబ‌లి`కి ఎన్నో హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తి. ర‌క‌ర‌కాల ప్రేర‌ణ‌ల‌తో `బాహుబ‌లి` రూపుదిద్దుకుంది అన్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక‌ `ఆర్ ఆర్ ఆర్` కి  క‌థ ప‌రంగా ప్రేర‌ణ‌లున్న‌ప్ప‌టికీ మేకింగ్ ప‌రంగా జ‌క్క‌న్న చాలా జాగ్ర‌త్త ప‌డ్డారు అన్న‌ది అంతే వాస్త‌వం. 
Tags:    

Similar News