సూపర్ స్టార్ సర్కారు వారి షెడ్యూల్ సిద్ధమైందా..??
దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో ఇంతకాలం ఆగిపోయిన షూటింగ్స్ అన్ని త్వరగా ప్రారంభించే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కావడానికి షెడ్యూల్ సిద్ధం అవుతోందట. ఆల్రెడీ సర్కారు వారి మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మధ్యలో ఏమైందో గాని సినిమా సంక్రాంతి కాకుండా ఈ ఏడాదిలోనే విడుదలకు ప్లాన్ చేసినట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే వచ్చే ఏడాది కోసం మహేష్ ఆల్రెడీ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాను లైనప్ చేసుకున్నాడు. అందుకే వీలైనంత త్వరగా సర్కారు పాట ఫినిష్ చేసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సర్కారు వారి షూటింగ్ ఒకే షెడ్యూల్ జరుపుకుంది. సెకండ్ షెడ్యూల్ టైంలోనే సెకండ్ వేవ్ వచ్చి షూటింగ్ నిలిచిపోయింది. మళ్లీ ఇటీవలే సర్కారు వారి పాట షూటింగ్ జులైలో ప్రారంభం కాబోతున్నట్లు కథనాలు వినిపించాయి. అయితే మేకర్స్ కూడా ఇటీవల స్పందించి.. త్వరలోనే అప్డేట్స్ అందిస్తాం అని ట్వీట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఇన్ఫో లేకపోవడంతో ఫ్యాన్స్ మళ్లీ సినిమా అప్డేట్స్ కోసం ట్రోల్స్ మొదలుపెట్టారు.
సర్కారు వారి పాట అనే డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ పూర్తిగా న్యూ లుక్కులో కనిపించనున్నాడు. గత నెలలో అప్డేట్స్ ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించారు. కానీ అదేం జరగలేదు. తాజాగా సూపర్ స్టార్ సర్కారు వారి చిత్రబృందం నుండి ఓ వార్త వైరల్ అవుతోంది. జులైలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ - 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు మహేష్ కూడా సర్కారు వారి పాటను నిర్మిస్తున్నాడు.