ప్రాజెక్ట్ K టైటిల్ ఫిక్స్ అయినట్లేనా?

Update: 2022-12-29 03:48 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఊరిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత మాత్రం ఇంతవరకు సరైన సక్సెస్ అయితే అందుకోలేదు. సాహో సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే తదుపరి సినిమాతో ప్రభాస్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆశతో ఉన్నారు.

ఇక దురదృష్టవశాత్తు ఆదిపురుష్ సినిమాకు గ్రాఫిక్స్ సరిగ్గా సెట్ కాకపోవడంతో ఆ సినిమాపై పెద్దగా హోప్స్ అయితే లేవు. మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా అంటున్నారు కానీ అది కూడా ఒక భయాన్ని కలిగిస్తోంది. ఇక సలార్ సినిమాపై మాత్రమే అత్యంత భారీ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. అలాగే ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి స్థాయిలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్లో తీసుకురాబోతోంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరపైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రాజెక్టు K అనేది నిజమైన టైటిల్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది షూటింగ్ మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ ఆ విధంగా ఒక పేరుని పెట్టుకుంది. కానీ అసలైన టైటిల్ మాత్రం మరొకటి అనుకుంటున్నారట.

ప్రస్తుతం అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ 2023 ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ గురించి ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టు K సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News