'అఖండ‌-2' కి ఉన్న అడ్డంకులివేనా?

Update: 2022-02-07 01:30 GMT
`అఖండ` స‌క్సెస్ తో బోయ‌పాటి శ్రీను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసారు. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ మళ్లీ స్టార్ ఫిలింమేక‌ర్స్ స‌ర‌స‌న టాప్ స్టాట్ లో నిల‌బెట్టింది. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ మ‌రోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డంతో బోయ‌పాటి పేరు ఇంటా బ‌య‌టా మార్మోగుతోంది. మ‌ళ్లీ అదే కాంబినేష‌న్ లో వీలైనంత‌ త్వ‌ర‌గా `అఖండ‌-2` చూడాల‌నుకుంటున్న‌ట్లు అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. అల్లు అర్జున్ స‌హా మ‌రికొంద‌రు స్టార్లు `అఖండ‌-2` చిత్రాన్ని తీయాల‌ని కోరుకుంటున్నారు. మ‌రి ఇది ఇప్ప‌ట్లో సాధ్య‌మేనా?  అంటే చాలా సంగ‌తులే ఉన్నాయి.

బోయ‌పాటి వైపు కూడా రూట్ ఇంకా క్లియ‌ర్ గా లేద‌నేది తాజా స‌మాచారం. అత‌డికి ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ క‌మిట్ మెంట్ ఉంది.

ఈ సినిమాకి గాను బోయ‌పాటి ఏకంగా 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని స‌మాచారం. బోయ‌పాటి కెరీర్ లో నే  హ‌య్యెస్ట్  రెమ్యున‌రేషనే అందుకోవ‌డం ఇదే మొద‌టిసారి. శ్రీనివాస చిట్టూరి అనే నిర్మాత బోయ‌పాటికి అంత భారీ పారితోషికం ఇచ్చి లాక్ చేసారు. ఇక ఇదే సినిమాకు రామ్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. రామ్ పారితోషికం ఏకంగా 9 కోట్లు అని స‌మాచారం. ఈ కాంబినేష‌న్ లో బోయ‌పాటి మార్క్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామ్ లింగు స్వామి ద‌ర్శక‌త్వంలో  `ది వారియ‌ర్``లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరినే  నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇలా రామ్ తో ఒకేసారి రెండు సినిమాల‌కు ఒప్పందం చేసుకున్నారు నిర్మాత‌. `ది వారియ‌ర్` పూర్త‌యిన త‌ర్వాత రామ్- బోయ‌పాటి కాంబినేష‌న్ సెట్స్ కి వెళ్ల‌నుంది. అటుపై బోయ‌పాటి గీతా ఆర్స్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మ‌రో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లు బోయ‌పాటి వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాలి. ఆ త‌ర్వాత మాత్ర‌మే `అఖండ‌`2 గురించి ఆలోచించే అవ‌కాశం ఉంది. ఈ వ్య‌వ‌ధిలో త‌న రైట‌ర్ల బృందం తో బోయ‌పాటి  స్క్రిప్ట్ ని సిద్ధం చేయిస్తారు. అంటే `అఖండ‌-2` .. 2024 చివ‌ర్లో గానీ 2025లో కానీ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. 
Tags:    

Similar News