పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే ఆయన సినిమాలు.. అభిమానుల్లో హై-ఓల్టేజ్ క్యూరియాసిటీని ఫిల్ చేస్తుంటాయి. అలాంటిది.. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమా రాబోతుండడంతో అందరి కళ్లూ వకీల్ సాబ్ పైనే పడ్డాయి.
అయితే.. పవర్ స్టార్ సినిమా అంటే.. టైటిల్ కూడా ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు ఫ్యాన్స్. అయితే.. కొన్నిసార్లు హీరో స్టార్ డమ్ కన్నా, సినిమా కథను బట్టి టైటిల్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వకీల్ సాబ్ విషయంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడట దర్శకుడు శ్రీరామ్ వేణు.
ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. దానికి చాలా తక్కువ సమయం ఉండడంతో.. ప్రమోషన్ మీద దృష్టిపెట్టింది యూనిట్. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు దర్శకుడు. మరోవైపు నిర్మాత దిల్ రాజు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా రూ.కోటి ఖర్చు చేసి, మెగాస్టార్, మెగాపవర్ స్టార్ ను ఆహ్వానించి ఘనంగా పండుగ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు.. వకీల్ సాబ్ టైటిల్ కు సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ సినిమా బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ అన్నది తెలిసిందే. న్యాయం కోసం పోరాడుతున్న మహిళల ఆవేదనే ఈ చిత్రం. కాబట్టి.. కథానుసారం ఈ చిత్రానికి ‘మగువ’ అని టైటిల్ పెడితే బాగుంటుందని అనుకున్నారట.
‘మగువా.. మగువా’ అంటూ సాగే పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇదే సినిమా టైటిల్ గా ఉంచాలని మొదట అనుకున్నారట. కానీ.. పవన్ రీ-ఎంట్రీ సినిమా కావడం.. ఆయన ఇమేజ్ ను కంపల్సరీ ప్రతిబింబించాల్సి రావడంతో.. అన్నీ ఆలోచించి ఫైనల్ గా వకీల్ సాబ్ ను ఫిక్స్ చేశారట! ‘మగువ’ను ఫైనల్ చేస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఏవిధంగా ఉండేదో..?