'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారంలో దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ మరియు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఫైనాన్సియర్స్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పూరీ ఇంటి ముందు ధర్నా చేయాలని బయ్యర్లు నిర్ణయించుకోవడం.. దీనిపై దర్శకుడు స్పందించిన ఆడియో బయటకు రావడం.. ఈ క్రమంలో పూరీ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ఇష్యూలో ప్రచారంలో ఉన్న విషయాలు.. పూరీ వాయిస్ మెసేజులు పరస్పర వైరుధ్యంగా ఉంటున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తీసిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో అందరూ తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం కోసం బయ్యర్లు డిమాండ్ చేయడంతో కొంతమేర తిరిగి చెల్లించడానికి పూరీ అంగీకరించాడు. దీని కోసం నెల రోజుల టైం తీసుకున్నారు. అయితే డబ్బులు చెల్లిచడంలో జాప్యం జరగడంతో ఎగ్జిబిటర్స్ అంతా పూరీ ఇంటి ముందు ధర్నా చేయడానికి.. సహచర బయ్యర్లకు వాట్సాప్ మెసేజ్ ను పంపించినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఈ నేపథ్యంలో పూరీ మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. తాను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని ఇవ్వాలని అనుకున్నానని.. కానీ ఇస్తానని చెప్పినా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దర్శకుడు వాపోయారు. తన పరువు తీయాలని తీస్తే, ధర్నా చేసిన వాళ్లను మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులు చెల్లిస్తానని పూరి పేర్కొన్నారు.
వాస్తవానికి ఎగ్జిబిటర్స్ కు దర్శకుడు జవాబుదారీ కాదు. కానీ ఈ వ్యవహారంలో 83 మంది ఎగ్జిబిటర్స్ పూరి ఇంటి ముందు ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఆడియోలో పూరీ మంచిగా మాట్లాడిన ఫైనాన్షియర్ శోభన్ బాబు మరియు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మీద పోలీసులకు ఫిర్యాదు చేసారు. శ్రీను - శోభన్ లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను ప్రేరేపిస్తున్నారని.. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబాన్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని పూరీ పేర్కొన్నారు.
ఇదంతా చూస్తుంటే 'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారంలో డబుల్ గేమ్ నడుస్తోందేమో అనిపిస్తుంది. వాట్సాప్ గ్రూపుల్లో ఇలా డిస్కషన్లు సాగుతున్నాయనే సమాచారాన్ని మాత్రమే పంపించాను తప్ప.. తానేమీ బెదిరించలేదని ఫైనాన్షియర్ శోభన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ పూరీ మాత్రం ఎగ్జిబిటర్లను పోగు చేసి తన ఇంటి మీదకు దాడి చేసేలా ప్రోత్సహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శోభన్ మరియు డిస్ట్రిబ్యూటర్ శ్రీను పేర్లు పెట్టాడు.
చట్టబద్ధంగా చూసుకుంటే 'లైగర్' ప్లాప్ అయినా పూరీ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ తన సినిమా వల్ల నష్టపోయారు కాబట్టి.. నైతిక బాధ్యతతో ఎంతో కొంత పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని తనకు సన్నిహితంగా ఉన్న బయ్యర్లకు చెబుతూ వచ్చారు. కానీ వాళ్లే పూరీ జగన్నాథ్ టచ్ లోకి రాలేదని.. ఫోన్ చేసినా రెస్పాండ్ కావడం లేదని ప్రచారం చేస్తున్నారనే టాక్ ఉంది.
ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్స్ ను రెచ్చగొట్టి పూరీ ఇంటి మీదకు వెళ్లేలా ప్రోత్సహించారని తెలుస్తోంది. అయితే దీని వెనుక 'లైగర్' ను కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన టాలీవుడ్ లోని ఓ బడా డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ హస్తం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. వరంగల్ శ్రీను లేదా శోభన్ కు పూరి డబ్బు చెల్లిస్తే.. తను థియేటర్ అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తం వెనక్కు వస్తుందో రాదో అని.. మిగిలిన ఎగ్జిబిటర్లను రెచ్చగొట్టినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇలా అయితేనే పూరీ 'నేనింతే' సినిమాకు సెటిల్ చేసినట్లుగానే డబ్బులు తిరిగి చెల్లిస్తారని వారిని ఎగదోలినట్లుగా చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం ఇప్పుడు పూరీ ఫిర్యాదుతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. మరి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.