ఇప్పడు ఏ హీరోని కదిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. ప్రభాస్ నుంచి నిఖిల్ వరకు ఏ హీరోని కదిలించినా పాన్ ఇండియా సినిమా ముచ్చట్లే చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని కూడా చేరుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అందులో ఒకటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'టక్ జగదీష్'. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలై ఫరవాలేదనిపించింది.
ఇక యంగ్ డైరెక్టర్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ లో చేసిన మరో మూవీ 'శ్యామ్ సింగరాయ్'. పీరియిడిక్ స్టోరీకి ప్రస్తుత కథకు లింకప్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.
అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. 'అంటే సుందరానికి' మూడు భాషల్లో మాత్రమే విడుదల కానుండగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చేస్తున్న 'దసరా' ఐదు భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది.
ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ నానికి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన తాఆజగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ని సింగరేణి కాలరీస్ లో జరుపుతోంది. ఇటీవల కొంత మేర ఒరిజినల్ సింగరేని కాలరీస్ లో జరిపిన టీమ్ అక్కడి హిట్ కు చిత్ర బృందం ఇబబ్ందులు ఎదుర్కొన్న నేపథ్యంలో హైదరాబాద్ శివార్లతో ఏకంగా సింగరేణి కాలరీస్ సెట్ ని క్రియేట్ చేసి అందులో షూటింగ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో నాని తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో నాని పాత్ర పేరు ధరణి. డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్న నాని లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. గోదావరిఖని సింగరేణి కాలరీస్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇదిలా వుంటే ఈ చిత్ర కథ ఇదే అంటూ ఓ వార్త తాజాగా బయటికి వచ్చింది. సింగేణి ఓపెన్ కాస్ట్ కారణంగా చాలా వరకు గ్రామాలు తమ భూమిని, ఇళ్ల స్థలాలని పోగొట్టుకున్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అంశం కావడంతో తాము పోగొట్టుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలంటూ చాలా గ్రామాలు పోరాటం చేశాయి. అదే అంశం నేపథ్యంలో 'దసరా' కథ వుంటుందని, ఓపెన్ కాస్ట్ కారణంగా విలువైన భూముల్ని పోగొట్టుకుని రోడ్డున పడ్డ కొంత మంది కోసం ఫైట్ చేసే యువకుడి కథగా ఈ సినిమా వుంటుదని ఫిల్స్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'స్పార్క్ ఆఫ్ దసరా' వీడియోలో కొంత మంది తన వెంట రాగా నాని 90 ఎం.ఎల్ బాటిల్స్ లింగీకి కట్టుకుని ఊర మాస్ గా కనిపిస్తూ రగులుతున్న బొగ్గులో బీడీని వెలిగించుకుంటూ కనిపించిన వీడియో ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి.