ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు శ్రీరామ్ ఆ సినిమా నిరాశ పర్చడంతో తదుపరి సినిమా కోసం ఏకంగా ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత వెంటనే అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమాను చేయాలనుకున్నాడు. అయితే అల్లు అర్జున్ కాస్త సమయం అడగడంతో మరే ప్రాజెక్ట్ చేయకుండా ఐకాన్ ను పట్టుకుని ఉన్నాడు. మరీ ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్ లో అంది వచ్చిన వకీల్ సాబ్ అవకాశంను సద్వినియోగం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో రీమేక్ చేసినా కూడా ఖచ్చితంగా మంచి మైలేజ్ దక్కుతుంది. కాని వేణు శ్రీరామ్ ఆ మైలేజ్ ను వినియోగించుకోవడంలో విఫలం అవుతున్నాడా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వకీల్ సాబ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఐకాన్ సినిమా ఖచ్చితంగా వెంటనే మొదలు అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కాని వకీల్ సాబ్ ను సక్సెస్ చేసినా కూడా వేణు శ్రీరామ్ పై బన్నీకి గురి కుదరలేదేమో అనిపిస్తుంది. అందుకే ఇతర ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకు వస్తూ ఐకాన్ సినిమాను వెనక్కు పెడుతూనే ఉన్నాడు. పుష్ప తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చేసేందుకు దాదాపుగా బన్నీ కన్ఫర్మ్ అయ్యాడు అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్.. బోయపాటిల కాంబో మూవీ రాబోతుందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సమయంలో కూడా ఐకాన్ గురించే వేణు శ్రీరామ్ ఆలోచిస్తున్నాడా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంచి ట్యాలెంట్ ఉన్న వేణు శ్రీరామ్ ఎందుకు ఇలా ఒకే ప్రాజెక్ట్ ను పట్టుకుని ఏళ్లకు ఏళ్లు వృదా చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐకాన్ కాకుంటే మరో మంచి కథను రాసుకుని మరో హీరో వద్దకు వెళ్లవచ్చు కదా. ఎందుకు అదే కథను పట్టుకుని ఉండటం అంటున్నారు. అల్లు అర్జున్ దాదాపుగా ఐకాన్ ను సైడ్ చేసినట్లుగానే కనిపిస్తున్నాడు. కనుక ఇప్పటికి అయినా వేణు శ్రీరామ్ వెంటనే మరో సినిమాను మొదలు పెడితే బాగుంటుందని ఆయన్ను అభిమానించే వారు అంటున్నారు. ఇప్పటి వరకు వేణు తీసిన మూడు సినిమాలను కూడా దిల్ రాజు నిర్మించాడు. ఇప్పుడు వేణు శ్రీరామ్ సినిమాను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అయినా కూడా వేణు మాత్రం వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాడు అనిపిస్తుంది.