రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. వీరిద్దరికి కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ను ఇచ్చింది. ఇద్దరు వరుస ఫ్లాప్స్ లో ఉండగా ఈ సినిమాతో మళ్లీ ఇద్దరి కెరీర్ జోరందుకుంది. ఇందులో నభా నటేష్ ఇంకా నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటించిన విషయం తెల్సిందే. సినిమాకు నిర్మాత కూడా అయిన పూరికి భారీ లాభాలు వచ్చాయి. ఇక తాజాగా మరోసారి శివరాత్రి సందర్బంగా పలు చిత్రాలతో పోటీ పడ్డ ఇస్మార్ట్ శంకర్ విన్నర్ గా నిలిచింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా శివరాత్రి సందర్బంగా ప్రత్యేక ఆటలను ప్రదర్శిస్తూ ఉంటారు. అర్థరాత్రి 12 గంటలకు ఆ తర్వాత 2.30 నిమిషాలకు రెండు ఆటలను ప్రదర్శించారు. క్రాస్ రోడ్స్ లో రెండు థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ ప్రదర్శించగా దాదాపుగా 1.25 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయట. ఇక ఎన్టీఆర్ అరవింద సమేతను కూడా రెండు షోలకు గాను ప్రదర్శించా లక్ష లోపు వసూళ్లు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
గీత గోవిందం.. సరైనోడు.. గద్దల కొండ గణేష్ లు కనీసం 25 వేల మార్క్ ను కూడా దాటలేక పోయినట్లుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగస్థలం చిత్రం కూడా శివరాత్రి సినిమాల జాబితాలో ఉంది. కాని అది కూడా పెద్దగా వసూళ్లను దక్కించుకున్న దాఖలాలు కనిపించలేదు. మొత్తానికి శివరాత్రికి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అందరు హీరోల సినిమాలను పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది.