టాలీవుడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'రంగ్ దే'. ఈ సినిమాలో మొదటిసారి హీరోయిన్ కీర్తిసురేష్ నితిన్ సరసన జతకట్టింది. మార్చ్ 26న రంగ్ దే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూడో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిపింది చిత్రబృందం. రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో రంగ్ దే చిత్రబృందం అంతా పాల్గొన్నారు. ఇదివరకు చెప్పినట్లుగానే మేకర్స్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు మూడు ప్రాంతాలలో నిర్వహించారు. మొదటగా రాయలసీమ కర్నూల్ లో ట్రైలర్ లాంచ్ చేసిన బృందం, తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ జరిపింది. తాజాగా చెప్పినట్లుగా ఆంధ్రాలో నిర్వహించడంతో ప్రమోషన్స్ ముమ్మరంగా సాగుతున్నాయని అర్ధమవుతుంది.
అయితే తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో యాంకర్ శ్రీముఖి.. డైరెక్టర్ వెంకీ అట్లూరిని చమత్కారమైన ప్రశ్నలు అడిగింది. వాటికీ సమాధానం చెప్పడానికి డైరెక్టర్ వెనకాముందు అయ్యాడు. ఇంతకీ శ్రీముఖి డైరెక్టర్ ను ఏమడిగింది? అంటే.. మీరు డైరెక్టర్ గా మూడు సినిమా చేశారు కదా.. మూడు సినిమాలను లవ్ స్టోరీలతో ఎందుకు తీశారు.. దాని వెనక కారణం ఏంటి? చెప్పండి. ప్రేక్షకులు మీరు చెప్పే జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ మాట్లాడుతూ.. 'శ్రీముఖి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. కావాలని లవ్ స్టోరీస్ తీయలేదు. అనుకోకుండా జరిగిపోయాయి. అలాగని రంగ్ దే కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఇందులో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది' అంటూ శ్రీముఖి ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం శ్రీముఖి వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించాడు.