సూర్య సినిమాపై అది గాలి వార్త‌ని తేల్చేశారు

Update: 2022-05-04 09:30 GMT
విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారు హీరో సూర్య‌. ఇటీవ‌ల ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`. సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన ఈ మూవీ ఓటీటీఓ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. హీరోగా, నిర్మాత‌గా సూర్య‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ త‌రువాత ఇదే స్ఫూర్తిలతో `జై భీమ్‌`ని న‌టిస్తూ జ్యోతిక‌తో క‌లిసి నిర్మించారు. జ్ఞాన‌వేల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం కూడా ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని, ల‌పు అవార్డుల్ని సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీ త‌రువాత సూర్య చేసిన `ఈటీ` బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది.

పాండిరాజ్ డైరెక్ష‌న్ లో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ మూవీని నిర్మించారు. భారీ హంగుల‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం సూర్య క్రేజీ డైరెక్ట‌ర్ బాల తో త‌న 41వ సినిమాని చేస్తున్నారు. దీనికి సూర్య‌, జ్యోతిక నిర్మాత‌లు. 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

సూర్య - బాల కాంబినేష‌న్ లో నందా, పితామ‌గ‌న్ (శివ పుత్రుడు), మాయావి వంటి సూప‌ర్ హిట్ చిత్రాలొచ్చాయి. `పితామ‌గ‌న్‌`లో సూర్య పాత్ర మ‌ధ్య‌లోనే చ‌నిపోయినా సినిమాపై కీల‌క ఇంపాక్ట్ ని క‌లిగించింది. దాదాపు 17 ఏళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ బాల - సూర్య క‌ల‌యిక‌లో ఈ మూవీని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

`ఉప్పెన‌` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ మొద‌టి షెడ్యూల్ క‌న్యా కుమారిలో ఇటీవ‌ల మొద‌లైంది. అక్క‌డ 34 రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు.
 
త‌దుప‌రి షెడ్యూల్ గోవాలో జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది. 15 రోజ‌లు పాటు జ‌రిగే ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నార‌ట‌. అది పూర్తి కాగానే 15 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయ‌బోతున్నామ‌ని చిత్ర బృందం బుధ‌వారం అధికారికంగా వెల్ల‌డించింది. జీవి ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్న ఈమూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ తో ఆగిపోయింద‌ని, ఇక ఈ సినిమాని సూర్య వ‌దిలేసిన‌ట్టేనంటూ ఇటీవ‌ల కోలీవుడ్ లో పుకార్లు మొద‌ల‌య్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన త‌దుప‌రి షెడ్యూల్ వివ‌రాల్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం ప్ర‌క‌ట‌న చేయ‌డంతో సూర్య సినిమాపై అది గాలి వార్త అని తేలింది.
Tags:    

Similar News