చాన్నాళ్ల‌కు సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఎగ్జిబిట‌ర్లు

Update: 2022-12-18 01:30 GMT
సినిమా వ్యాపారం భార‌త‌దేశంలో అన్నిచోట్లా ఒకేటా ఉండ‌దు. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ ఒక ప్ర‌త్యేక విధానాన్ని మ‌న అగ్ర‌ నిర్మాత‌లు ఆపాదించార‌ని చెబుతుంటారు. ఇక్క‌డ ఎగ్జిబిట‌ర్లు.. పంపిణీదారులు ఎలా ఉండాలి? అన్న‌ది నిర్మాత‌ల గిల్డ్ లో కీల‌క వ్య‌క్తులు నిర్ణ‌యిస్తారు. చాలా వ‌ర‌కూ థియేట‌ర్ల‌పై గుత్తాధిప‌త్యం చేసేది వీళ్లేన‌న్న వాద‌నా ప్ర‌తిసారీ వినిపిస్తూ ఉంటుంది.

థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ ల‌కు అద్దె వ‌సూల్ ఒక ప‌ద్ధ‌తి కాగా.. లాభాల్లో షేరింగ్ అనేది ఇంకో ప‌ద్ధ‌తి. కొంద‌రు అగ్ర నిర్మాత‌లు మెజారిటీ థియేట‌ర్ల‌ను త‌మ గుప్పిట ప‌ట్టి లాభాలార్జిస్తార‌ని చెబుతుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు అవ‌తార్ 2 రిలీజ్ విష‌యంలో థియేట‌ర్ య‌జ‌మానులు కొత్త పంథాను అనుస‌రించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం గొప్ప మార్పుగా చెబుతున్నారు. అవ‌తార్ 3డిని ఆడించే సింగిల్ థియేట‌ర్ య‌జ‌మానుల‌కు అవ‌తార్ 2తో బాగానే క‌లిసొస్తుందనేది ఒక విశ్లేష‌ణ‌.

నిజానికి సినిమాకి వంద‌శాతం  లాభాలు వ‌చ్చినా థియేట‌ర్ య‌జ‌మానుల‌కు వెళ్లేది 20-30శాతం మాత్ర‌మే. అద్దె ప్రాతిప‌దిక‌న అయితే లాభ‌న‌ష్టాల‌తో త‌మ‌కు సంబంధం ఉండ‌దు. అద్దె వ‌సూలు చేసుకుంటారు. షేర్ ప్రాతిప‌దిక‌న అంటే లాభన‌ష్టాల్లోను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అవ‌తార్ 2 విష‌యంలో ఎలాంటి సందేహాలు లేకుండా షేర్ విధానాన్ని థియేట‌ర్ య‌జ‌మానులు (ఎగ్జిబిట‌ర్లు) ఉత్సాహంగా ఎంచుకున్నార‌ట‌. ఇది తెలివైన నిర్ణ‌య‌మ‌ని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అవ‌తార్ 2తో థియేట‌ర్ య‌జ‌మానుల‌కు అద‌న‌పు ఆదాయం ఎలా వ‌స్తోంది? అంటే 3డి గ్లాసెస్ రూపంలో వ‌రం ల‌భించింద‌ని చెబుతున్నారు. 3డి గ్లాసెస్ కి అద‌నంగా టికెట్ ధ‌ర‌ల్లోనే రేటును చేర్చ‌డంతో ఆ మొత్తం ఇప్పుడు ఎగ్జిబిట‌ర్ల‌కు మాత్ర‌మే చెందుతుంద‌ని తెలిసింది. దీంతో 50 శాతం మించి థియేట‌ర్ య‌జ‌మానులు  జేబులో వేసుకునేందుకు ఆస్కారం ఉంది.

ఇప్ప‌టికే మూవీని వీక్షించిన‌ సినీ విమర్శకులు అవతార్ 2ని 3D వెర్షన్ లో మాత్రమే చూడాలని సలహా ఇవ్వడంతో ప్ర‌తి ఒక్క‌రూ దానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. 2డి వెర్ష‌న్ కంటే 3డి వెర్ష‌న్ కి డిమాండ్ అధికంగా ఉంది. నిజానికి 3డి క‌ళ్ల‌ద్దాల తో వ‌చ్చే అద‌న‌పు మొత్తాన్ని తాము తీసుకోబోమ‌ని డిస్నీ నుంచి హామీ ఉందిట‌. అంటే నిర్మాత‌ల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎగ్జిబిట‌ర్ పై లేదు. దీంతో థియేట‌ర్ య‌జ‌మానులు తెలివిగా షేర్ విధానాన్ని ఎంపిక చేసుకుని అద్దె విధానాన్ని లైట్ తీస్కున్నారు. షేర్ ప్రాతిప‌దిక‌న‌ ఇప్పుడు ఊహించిన దాని కంటే ఎక్కువ దండుకుంటున్నార‌ని స‌మాచారం.

అవ‌తార్ 2 రూపంలో నిర్మాత‌లు పంపిణీదారుల కంటే ఎగ్జిబిట‌ర్ల‌కు లాభ శాతం అధికంగా ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఉత్త‌రాదిన మాత్రం వేరొక విధంగా ఉంది. అక్క‌డ టికెట్ ని అమ్మే ధ‌ర‌లో 65శాతం వాటా నేరుగా డిస్నీ (నిర్మాత‌లు) కే చెందుతుంద‌ని స‌మాచారం. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ య‌జ‌మానులకు సెల‌బ్రేష‌న్ టైమ్ ఇద‌ని చెప్పొచ్చు. ఈ సెల‌బ్రేష‌న్ ని తెచ్చింది ఒక హాలీవుడ్ సినిమా మాత్ర‌మే. త్వ‌ర‌లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి వ‌స్తున్నాయి. వీటితో అలాంటి ఫెసిలిటీ లేనే లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News