రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'శివ' సినిమాతో చక్రవర్తి తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన 'జేడీ' పాత్రతో జేడీ చక్రవర్తిగా పాప్యులర్ అయ్యాడు. ఆ తరువాత 'గులాబీ' సినిమాతో సోలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'చక్రి భ్రమణం' కార్యక్రమంలో ఆ సినిమాను గురించి .. ఆ సినిమా చుట్టూ అల్లుకున్న అనేక అంశాలను గురించి ఆయన ప్రస్తావించాడు. 'గులాబీ' సినిమా కంటే ముందుగానే 'అనగనగా ఒక రోజు' మొదలైంది. ఆ సినిమాకి దర్శకుడు కృష్ణవంశీనే.
కొన్ని క్లారణాల వలన అలిగి ఆ సినిమా తాను చేయననీ .. తాను ఊరెళ్లిపోతానని వర్మతో కృష్ణవంశీ చెప్పాడు. అప్పుడు బస్సుకా? ట్రైనుకా? అని వర్మ అడిగారు. 'అనగనగా ఒక రోజు' నుంచి వంశీ తప్పుకోవడానికీ .. వర్మ తీసేయడానికి వెనుక పెద్ద చరిత్ర ఏమీ లేదు .. అక్కడ ఉన్నది బడ్జెట్ సమస్య మాత్రమే. ఈ సినిమాకి అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైపోతోంది .. 'నేను హ్యాండిల్ చేస్తాను' అని వర్మ అన్నాడంతే. ఆ తరువాత వంశీ నాకు కొన్ని కథలు చెప్పాడు. వాటిలో 'గులాబీ' కథ నాకు బాగా నచ్చింది.
అప్పుడు నేను 'గులాబీ' కథ చాలా బాగుందని వర్మను సతాయించడం మొదలుపెట్టాను. "తక్కువ బడ్జెట్ లోనే చేస్తాడు .. నాకు నమ్మకం ఉంది సార్" అని చెప్పాను. వర్మగారికి 'గులాబీ' కథ తెలియదు .. కేవలం నన్ను నమ్మారాయన. "చక్రీ నువ్వు వంశీని నమ్ముతున్నావ్ .. నేను నిన్ను నమ్ముతున్నాను" అన్నారు. ఈ లోగా ఈ సినిమాను వర్మ తీయరనే నమ్మకంతో వంశీ బైట నిర్మాతలను ట్రై చేయడం మొదలిపెట్టాడు. ఆ సమయంలో వర్మ మళ్లీ టచ్ లోకి వచ్చారు. అమితాబ్ ప్రొడక్షన్ తో కలిసి 'గులాబీ' చేద్దామని అన్నారు.
ఇక అప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు .. అమితాబ్ గారు కూడా యాడయ్యారు గనుక, సినిమా స్టార్ట్ కావడం ఖాయమని అనుకున్నాం. ఆ సాయంత్రం అపార్టుమెంట్ పై డాన్సులు చేశాము .. ఆ రాత్రి కి సీన్ మారిపోయింది. అమితాబ్ ఇంటిపై ఇన్ కమ్ టాక్స్ రైడ్ జరిగింది అని చెప్పారు. అప్పుడు నాకు 'ఆకలి రాజ్యం'లోని ఒక సీన్ గుర్తొచ్చింది. ఆ సినిమాలో .. కొన్ని రోజులుగా ఆకలితో ఉన్నవాళ్లంతా ఆ రోజున అన్నం తిందామని అనుకుంటూ ఉండగా శ్రీదేవి నాయనమ్మ చనిపోతుంది. అలా ప్రథమ ఘట్టం మొదలవకుండానే ఆగింది. ఆ తరువాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ లో చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టేశాడు.