టీజర్ టాక్: సారీ! నిన్ను ఎక్కడ వదిలేసానో..అక్కడే ఉన్నా!
తమిళ బ్లాక్ బస్టర్ 96ని తెలుగులో `జాను` అనే టైటిల్ తో దిల్ రాజు రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్...త్రిష రోల్ లో సమంత నటిస్తోంది. ఇటీవలే శర్వానంద్ లుక్ కి సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఏడారిలో ఒంటెలతో హీరోగారి సావాసాన్ని అలుపెరగని పయనాన్ని పోస్టర్ లో ఎలివేట్ చేశారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే టీజర్ ను కూడా రిలీజ్ చేసారు.
టీజర్ ఓ వండర్. రెండు నిమిషాల పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్ ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించిన ఫీట్ గుడ్ టీజర్ ఇది. ప్రతి మనిషికి స్కూల్ డేస్ .. ఆ తర్వాత కెరీర్.. ఉద్యోగాలు అంటూ వెళ్లిపోయాక తిరిగి బాల్య స్నేహాలు గుర్తుకు వస్తేనో లేదా మళ్లీ కలిసినప్పుడో పుట్టుకొచ్చే ఎమోషన్ ఎంతో గొప్పగా ఉంటుంది. టీజర్ ఆరంభమే ఎత్తుగడ బావుంది. ఓ నిర్జనమైన ఎడారి ప్రదేశంలో హీరో బైక్ డ్రెవ్ చేసుకుంటూ వెళుతూ.. ఉంటాడు.. అటుపై స్కూల్ డేస్ లోకి తీసుకెళ్లిపోయారు. హీరో స్కూల్ డేస్ లోకి వెళ్లిపోతాడు. జానుతో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏదో లోకంలోకే తీసుకెళ్లాడు.... జానూ (సమంత) తారస పడ్డాక నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషన్ అవ్వడం ఆసక్తిని కలిగిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో కాదలే కాదలే రీ రికార్డింగ్ మాత్రం సోల్ మిస్ అవ్వకుండా కొత్తగా ట్రై చేసారు. కానీ ఆర్.ఆర్ మాత్రం ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ స్థాయికి ఫీల్ ని తీసుకురాలేదనే చెప్పాలి. 96తో పోలిస్తే ఇంకా ఏదో మిస్ అయిందన్న భావన కలగకుండా చేయాల్సి ఉంటుంది. సమంత కాస్ట్యూమ్స్ ని మాత్రం మక్కీకి మక్కీ దించేసారు. విజయ్ సేతుపతి తరహాలో శర్వా పాత్రలో రగ్గడ్ నెస్ కనిపించలేదు. రెండు మూడు వేరియేషన్స్ .. బాల్యానికి సంబంధించిన గెటప్పులతో శర్వా కనిపించాడు.
తెలుగు నెటివిటీకీ తగ్గట్టు ఆ పాత్రలో ఎక్కువగానే మార్పులు చేశారని టీజర్ చెబుతోంది. టీజర్ తో కొంత క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ వచ్చేస్తే.. సినిమా ఎలా ఉంటుందో మరి కాస్త క్లారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్ గా ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరి అని టీజర్ క్లియర్ కట్ గా చెబుతోంది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. చిత్రీకరణ తుదిదశలో ఉంది. బ్యాలెన్స్ పనులు..పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్బంగా రిలీజ్ చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ నే ఇక్కడ కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
Full View