ట్రైలర్‌ టాక్‌ : జాను ఏదో తేడా కొడుతుందేంటి?

Update: 2020-01-29 11:52 GMT
తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన '96' ను తెలుగులో 'జాను'గా రీమేక్‌ చేస్తున్నారు. విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఫస్ట్‌ లుక్‌ నుండి టీజర్‌ మరియు పాటల వరకు అన్ని కూడా తమిళ 96 కు మక్కీకి మక్కీ దించినట్లుగా ఉన్నాయి. దాంతో సినిమాను కూడా ఏమాత్రం మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా తీసి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

కాని ట్రైలర్‌ విడుదల తర్వాత కాస్త అనుమానంగా ఉంది. సినిమా క్లైమాక్స్‌ లో ఏదో చిన్న మార్పు చేసినట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 96 చిత్రానికి యాంటీ క్లైమాక్స్‌ ఉంటుంది. అంటే హీరోయిన్‌ వేరే అబ్బాయిని  పెళ్లి చేసుకోవడం హీరోను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్లి పోతుంది. కాని తెలుగులో అలా ఉండదేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్‌ చూస్తుంటే తమిళంలో మాదిరిగా కాకుండా తెలుగులో తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా క్లైమాక్స్‌ ఉంటుందేమో అనే ఊహాగాణాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సమంతకు ఈ సినిమాలో పెళ్లి కాదేమో.. క్లైమాక్స్‌ లో శర్వానంద్‌ ను పెళ్లి చేసుకుంటుందేమో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. మొత్తానికి ట్రైలర్‌ చూస్తుంటే ఒరిజినల్‌ వర్షన్‌ కు దీనికి ఎక్కడో తేడా కొడుతుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఫిబ్రవరి 7న సినిమా విడుదల అయితే క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇప్పటి నుండే జుట్టు పీక్కోవడం ఎందుకు చెప్పండి...!

Full View
Tags:    

Similar News