అలాంటి పాటను ఒప్పుకున్న అనసూయ!

Update: 2018-12-05 07:48 GMT
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న అనసూయ భరద్వాజ్ సినిమాల్లో కూడా తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా 'రంగస్థలం' లో రంగమ్మత్తగా ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకోవడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఒకరకంగా అనసూయకు టాలీవుడ్ లో నటిగా పెద్ద బ్రేక్ వచ్చినట్టే.  తాజాగా అనసూయ ఒక ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు హీరోలు గా 'ఎఫ్ 2' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట.  ఈ ఐటెం నెంబర్ కోసం అనసూయను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పిందట.  ఇలా ఐటెం సాంగ్ చేయడం అనసూయకు కొత్త  కాదు కానీ ఆ పాటను 'ఐటెం సాంగ్' అని పిలవడం మాత్రం ఆమెకు నచ్చదు.  గతంలో సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలో అలా ఒక ప్రత్యేక గీతం లో నర్తించింది ఈ జబర్దస్త్ బ్యూటీ.  అప్పటినుండి తనకు ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్లు వస్తున్నా ఎందుకో వాటిని స్వీకరించలేదట. కానీ ఇప్పుడు మాత్రం 'ఎఫ్2' ఆఫర్ కు వెంటనే యస్ చెప్పిందట.

'ఎఫ్ 2' లో వెంకీ.. వరుణ్ లు తోడల్లుళ్ళుగా నటిస్తున్నారు. మరి ఈ సంక్రాంతి తోడల్లుళ్ళ కలిసి రంగమ్మత్త తో కలి సి ఎలా రచ్చ చేస్తారో వేచి చూడాలి.  ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాబట్టి ఓ జబర్దస్త్ మాస్ ట్యూన్ ఈపాటికి రెడీ చేస్తూనే ఉంటాడు.  గెట్ రెడీ ఫర్ స్పెషల్ హంగామా గైస్..!
Tags:    

Similar News