ఆ పాట లేనందుకు ఫైన్ కట్టాల్సిందే

Update: 2017-10-25 05:02 GMT
సినిమాకు రిలీజ్ కు ముందు అందులో పాట విని తెగ నచ్చేసి తీరా థియేటర్ కు వెళ్లాక ఆ పాట లేకపోతే నిరాశపడతాం. కానీ మహారాష్ట్రలో ఓ మహిళకు ఇలాంటి వ్యవహారంపై కోపమొచ్చింది. ప్రేక్షకులను మోసం చేశారంటూ కోర్టుకెక్కింది. చివరకు నిర్మాతల నుంచి పరిహారం కూడా రాబట్టింది.

గత ఏడాది బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఫ్యాన్ పేరుతో ఓ సినిమా చేశాడు. తాను ప్రాణమిచ్చే హీరోకు వ్యతిరేకంగా మారిపోయిన ఓ అభిమాని కథతో ఈ సినిమా తీశారు. ఈ సినిమా ప్రమోషన్ టైంలో వినిపించిన జబ్రా ఫ్యాన్ అనే పాట పాపులర్ అయింది. కానీ ఎందుకో సినిమాలో ఈ పాట లేదు. దీంతో ఔరంగాబాద్ లో ఆప్రీన్ జైదీ అనే మహిళ కోర్టుకెక్కింది. ముందు కోర్టు ఈ పిటీషన్ ను కొట్టేసింది. తర్వాత కొన్ని కరెక్షన్లతో ఆమె పిటీషన్ ను కోర్టు విచారణకు తీసుకుంది. చివరకు పిటీషనర్ కు రూ. 15000 చెల్లించాలని ఫ్యాన్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ కు ఆదేశాలు జారీ చేసింది.

కొత్తగా రిలీజయ్యే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేది ట్రయిలర్ - పాటలే. సినిమా రిలీజైన కొత్తలోనే చూసేవారిలో ఎక్కువమంది సినిమా చూడాలా వద్దా అన్నది వీటినిబట్టే డిసైడై పోతారు. సినిమా రిలీజ్ కన్నా ముందే జనాలకు పాటలు ఎక్కితే ఇక మొదటివారంలోనే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. కానీ యశ్ రాజ్ ఫిలింస్ వాళ్లకేమో ఈ ప్రయత్నం బెడిసికొట్టి చివరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఫ్యాన్సందరూ ఒకేలా ఉండరు కదా..
Tags:    

Similar News