కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. న్యూ ఇయర్ అందరికీ కలిసి రావాలని వేడుకుంటోన్న సమయం ఇది. కోటి ఆశలతో భామామణులంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టకముందే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ కి ఓ బంపర్ ఆఫర్ వరించింది.
సోనూసూద్ హీరోగా తెరకెక్కనున్న 'ఫతే' సినిమాలో హీరోయిన్ గా జాకీని ఎంపిక చేసారు. పలువురు భామల్ని పరిశిలించిన తర్వాత జాకీ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెని ప్రాజెక్ట్ లోకి ఏరికోరి మరీ తెచ్చారుట. ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా సోనూసూద్ నే . ఆయన స్వయంగా ఫోన్ చేసి తన సినిమాలో నటించాలని జాకీని కోరారుట.
అందుకు జాకీ కాదు..లేదు అనకుండా వెంటనే అంగీకరించిందిట. ఈ సినిమాకు పారితోషికంగా భారీగానే ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక్కడ జాకీ మరో విధంగానూ లక్కీ గాళ్ అని చెప్పాలి. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమవుతోంది. రకరకాల కారణాలుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా జనవరిలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో హీరోయిన్ ఎంపిక జరగక పోవడంతో వెంటనే సోనూ సీన్ లోకి దిగి జాకీని లాక్ చేసారు. ఆ రకంగా ప్రాజెక్ట్ కొత్త ఏడాది లో ముందుకు కదులుతుంది. అభినందన్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డిజిటల్ స్కామ్...నేపథ్యంగా సాగే స్టోరీ ఇది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా కథని సిద్దం చేసారు.
దీనిలో భాగంగా పలు ఎథికల్ హ్యాకర్లతోనూ చిత్ర బృందం చర్చలు జరుపుతోంది. వాళ్ల స్వీయ అనుభవాలు కథలో జోడించి..అవసరం మేర వాళ్లని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జాకీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంది. ఆ కారణంగా కొన్ని ప్రాజెక్ట్లులు చేజార్చుకుంది. కొత్త ఏడాదిలైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా కెరీర్ సాగించాలని ఆశపడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.