శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్.. మొరాకన్ బ్యూటీ నోరా ఫతేహి మధ్య ప్రత్యక్ష కోర్ట్ వివాదం గురించి తెలిసినదే. నోరా ఫతేహి తన సహ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై ద్వేషంతో పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసిందంటూ జాక్విలిన్ పై పరువునష్టం దావా వేయడం ఇటీవల హెడ్ లైన్స్ లోకొచ్చింది.
జాక్విలిన్ స్వప్రయోజనాల కోసం తన కెరీర్ ను నాశనం చేయడానికి నేరపూరితంగా పరువు తీయడానికి ప్రయత్నించిందని నోరా ఆరోపించారు. ఈ గొడవకు కారకుడు కాన్ మేన్ సుఖేష్ చంద్రశేఖర్. అతడిపై 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఆరోపణల్లో జాక్వెలిన్- నోరా పేర్లు ముడిపడి ఉన్నాయి. ఆ ఇద్దరినీ ఈడి (ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించింది.
జాక్వెలిన్ కోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో పేర్కొనడంతోనే తనను ED తప్పుగా ఇరికించిందనేది నోరా ఫతేహి ఆరోపణ. తనను సాక్షులుగా ఈడీ పేర్కొనడానికి కారణం జాక్విలిన్ అని పేర్కొంది. అయితే సుకేష్ చంద్రశేఖర్ నుండి బహుమతులు పొందడంపైనా నోరా ఓపెనైంది.
తాజాగా నోరా ఫతేహి వేసిన పరువు నష్టం దావాపై జాక్వెలిన్ ఫెర్నాడెజ్ లాయర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో లాయర్ పాటిల్ మాట్లాడుతూ నోరాపై జాక్వెలిన్ ఎప్పుడూ మీడియాలో ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. జాక్విలిన్ చాలా స్పృహతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రొసీడింగ్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు వరకు ఆమె చట్టం పవిత్రతను కాపాడుకుంది. కోర్టు పరిధిలోని అంశం కావడంతో ప్రింట్ అలాగే సోషల్ మీడియా ల్లో చర్చలకు ఎప్పుడూ దూరంగా ఉంది`` అని అన్నారు.
నేరపరిశోధనను నేరం అంగీకరించడం అని అనరు! అంటూ జాక్విలిన్ లాయర్ వ్యాఖ్యానించారు. ఇంకా పరిశోధించి నిజాలు బయట పెట్టాల్సి ఉందని అన్నారు. నోరా దాఖలు చేసిన దావా అధికారిక కాపీ మాకు అందలేదు. మేం అధికారిక ధృవీకరణ లేదా గౌరవనీయ న్యాయస్థానం నుంచి ఉత్తర్వును స్వీకరించిన తర్వాత దానికి చట్టబద్ధంగా ప్రతిస్పందిస్తామని జాక్విలిన్ లాయర్ తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.