తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేకమైన ముద్ర. 2004 ఎన్నికల్లో ఆయన ప్రభంజనం ఎలా సాగిందో తెలిసిందే. ఆ తర్వాతి ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమైనా ఒంటి చేత్తో ఎదుర్కొన్నాడు. మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఆ మహా నేత కథను వెండితెరమీదికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందిప్పుడు. వైఎస్ అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన పాద యాత్రను హైలైట్ చేస్తూ యువ దర్శకుడు మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ పేరుతో ఇటీవలే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం వైఎస్ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.
‘యాత్ర’ సినిమాను ఎలా రూపొందిస్తారని వైఎస్ తనయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా మీద ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. పార్టీ తరఫున ఒక టీం చిత్రీకరణను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. వాస్తవాల్లో ఏమీ తేడా రాకుండా చూడటంతో పాటు ఏమైనా సలహాలు.. సూచనలు అవసరం అవుతాయేమో అని.. ఒక టీం చిత్ర బృందంతో పాటు కలిసి సాగుతోందట. నిర్విరామంగా షూటింగ్ జరుపుతూ ఒకే ఒక షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబరుకల్లా సినిమా పూర్తయిపోతుందట. మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని నిర్మించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముంగిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.