‘లెజెండ్’ సినిమాతో ఒక్కసారిగా జగపతిబాబు కెరీర్ అనుకోని మలుపు తిరిగింది. తెలుగులోనే కాక తమిళ.. మలయాళ భాషల్లోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ.. భారీ పారితోషకాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు జగపతి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయనే అన్నా ఆశ్చర్యం లేదేమో. ఐతే తాను పారితోషకం ఎక్కువే తీసుకుంటున్నప్పటికీ.. నిర్మాతలు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు జగపతి తెలిపాడు.
‘‘పారితోషకం విషయంలో నిర్మాతలు నాతో చెప్పే మాటలు భలే ఉంటాయి. చిన్న సినిమాల నిర్మాతలేమో.. ‘మాది చిన్న సినిమా.. అంత ఇచ్చుకోలేం.. మీరు తగ్గించుకోవాలి’ అంటున్నారు. పెద్ద నిర్మాతలేమో.. ‘మాది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి మీరే కొంచెం తగ్గించుకోవాలి’ అంటున్నారు’’ అని జగపతిబాబు చెప్పాడు. డేట్ల సమస్య వల్ల తాను కొన్ని పెద్ద సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని.. ఐతే అలా వదులుకున్న సినిమాలు ఫ్లాపయ్యాయని జగపతి చెప్పడం విశేషం.
ఇక విలన్ పాత్రలకు మారాక తన కెరీర్ గురించి జగపతి చెబుతూ.. ‘‘ఈ జర్నీ చాలా బాగుంది. నిజంగా నేను ఊహించని మలుపు ఇది. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం వల్లే చాలామంది గొప్ప నటులతో.. వేర్వేరు తరాల వాళ్లతో చేయగలుగుతున్నా. ఏ తరం ఎలా ఆలోచిస్తోందో అర్థమవుతోంది. అందరి దగ్గర నుంచీ నేర్చుకొనే అవకాశం లభిస్తోంది. లెజెండ్ సినిమాలో నా పాత్ర తర్వాతే విలన్ల విషయంలో మొనాటనీ బ్రేక్ అయింది. బలమైన ప్రతినాయక పాత్రలు పెరుగుతున్నాయి. దాంతో కథ కూడా కొత్త పుంతలు తొక్కే అవకాశం వస్తోంది’’ అని జగపతి చెప్పాడు.