జగపతి బాబు ఇప్పుడు స్టార్ విలన్ అయిపోయాడు. సౌత్ మొత్తంలో మోస్ట్ హ్యాండ్సమ్ రిచ్ విలన్ గా చక్రం తిప్పేస్తున్నాడు. ఇప్పుడో కొత్త ఆన్ లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు జగపతి. అయితే.. ఇధి వ్యాపార దృక్పథంతో కాకుండా.. తన స్వయంగా ఎదుర్కున్న కష్టాల్లోంచి పుట్టిన ఆలోచనగా చెబుతున్నాడు.
ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఇండస్ట్రీలో తాను 8 నెలలపాటు చాలా కష్టపడాల్సి వచ్చిందని, తనలో తనే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్న జగపతి బాబు.. ఆ పరిస్థితి ఎవరికి రాకుండా ఉండేందుకే క్లిక్ సినీ కార్ట్ ఆన్ లైన్ పోర్టల్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇది సినిమాకు సంబంధించి వన్ స్టాప్ అంటున్న జేబీ.. తన తండ్రికి రెండు కోర్కెలు మిగిలిపోయాయని.. ఇప్పుడు వాటిని తీరుస్తున్నట్లు చెప్పాడు. జగపతి అండ్ బ్రదర్స్ కి.. అందరూ కూతుళ్లే. అందుకే వారసులు లేరనే కోరిక మిగిలిపోయిందట ఆయనకి. మా నాన్నకు వారసుడు ఈ సంస్థ అంటున్న జగపతి.. ఇలా ఆయన ఒక కోరిక తీరినట్లే అంటున్నాడు.
అలాగే తనతో హిట్ తీయలేకపోయాననే బాధ ఉండేది జగపతి బాబు తండ్రికి. ఇప్పుడు జగపతి బ్యానర్ ను తిరిగి లాంఛ్ చేస్తున్నామని, ఏటా రెండు సినిమాలు తీయబోతున్నామని చెప్పాడీ సీనియర్ హీరో. తమ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలో నటులను.. పోర్టల్ నుంచి తీసుకునే యోచన ఉందట. తను తీసే సినిమాలతో హిట్ కొట్టి నాన్న రెండో కోరిక కూడా తీరుస్తా అంటున్నాడు జగపతి బాబు.