జగపతి ఎవరిని ఇంట్రొడ్యూస్‌ చేస్తాడో..

Update: 2016-04-25 09:19 GMT
చిరంజీవి.. మోహన్‌ బాబు.. మురళీ మోహన్‌.. కోట శ్రీనివాసరావు.. ఇలా అందరూ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ లో ట్రైనింగ్‌ తీసుకుని.. యాక్టర్లు అయినవారే. అయితే వీళ్ళందరికీ ఛాన్సులు ఎంతో కష్టపడితేనే వచ్చాయి. మరి ఇప్పుడు నవతరం యాక్టింగ్‌ యాస్పిరెంట్లకు అలా కష్టపడినా ఛాన్సులు రావట్లేదు. అందుకే జగపతి బాబు తన కొత్త బిజినెస్‌ షురూ చేశాడు.

క్లిక్‌ సినీ కార్ట్‌ అంటూ ఒక పోర్టల్‌ స్థాపించాడు జగపతి బాబు. ఈ పోర్టల్‌ లో వివిద ట్యాలెంట్లకు చెందిన నూతన యువతీయువకుల డిటైల్స్‌ ఉంటాయి. వాటిన చూసి నచ్చితే సినిమా ప్రొడ్యూసర్లు.. దర్శకులు.. వారిని హ్యాపీగా ఎప్రోచ్‌ అయ్యే ఛాన్సుంది. మరి తన కొత్త బిజినెస్‌ ద్వారా ఎంతమంది ఫ్యూచర్‌ స్టార్లను జగపతి బాబు తెలుగు సినిమా ఇండస్ర్టీ కి పరిచయం చేస్తాడనేది చూడాలి. దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఈ క్లిక్‌ సినీ కార్ట్‌ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు జగపతి ఔత్సాహిక యంగస్టర్స్ కు హెల్ప్‌ చేసే పనిలో పడ్డాడు మరి. గుడ్ లక్‌ మాష్టారూ!!

తన సినిమాల విషయానికొస్తే.. తెలుగు అండ్‌ తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు జగపతి బాబు.
Tags:    

Similar News