చిరంజీవి 150వ సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిబాబుని సంప్రదించారని, కానీ ఆయన సంతకం చేయకుండా తన నిర్ణయాన్ని తర్వాత చెబుతానన్నాడని తెలుగు ఇండస్ట్రీలో ప్రచారం సాగింది ఆమధ్య. అవకాశం రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకొనే జగపతిబాబు చిరు సినిమా విషయంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తున్నాడనే విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే ఇదే విషయంపై ఎట్టకేలకి జగపతిబాబు స్పందించాడు.
నన్ను చిరు సినిమాకోసం సంప్రదించిన మాట వాస్తవమే కానీ, ఆ తర్వాత మళ్లీ వాళ్ల నుంచే ఎటువంటి స్పందన రాలేదని స్పష్టం చేశాడు జగ్గూభాయ్. అంటే చిరు - వినాయక్ లే జగపతిబాబు కాకుండా మరో నటుడి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. నిజానికి మొదట్లో ఆ సినిమాలో విలన్ గా నటించేది ఓ బాలీవుడ్ నటుడు అని ప్రచారం సాగింది. ఆయన ఓ సీనియర్ హీరోయిన్ భర్త కూడా అట. అంతా ఓకే అనుకొన్నాక చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇచ్చేశాడట. దీంతో బంతి జగ్గూభాయ్ కోర్టులోకే వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంత వెతికినా వినాయక్ కి జగపతిబాబుని మించిన నటుడు దొరకడం లేదట. అందుకే ఆయన్నే విలన్ గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నాడట. రెండు మూడు రోజుల్లో ఆ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.