బాలయ్య సినిమాలో గజినీ ఫార్ములా?

Update: 2019-05-12 05:34 GMT
ఊహించని విధంగా బోయపాటి శీను బదులు కెఎస్ రవికుమార్ ని రంగంలోకి దించి కొత్త సినిమా మొదలుపెట్టబోతున్న బాలకృష్ణ దాని కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న టీం ఈ నెలలో ప్రారంభోత్సవం జరిపి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. రూలర్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చేసింది. జగపతి బాబు విలన్ గా ఫిక్స్ అయిన విషయం కూడా పోయిన నెలే లీకైపోయింది.

ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో విలన్ గా చేస్తున్న జగపతి బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. అది తండ్రి కొడుకులా లేక అన్నదమ్ములా అనే ట్విస్ట్ ఇంకా రివీల్ కాలేదు. కాకపోతే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది

అయితే ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. సూర్య-మురుగదాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ లో విలన్ ప్రదీప్ రావత్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. అయితే ఆ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ ముందు రివీల్ అయ్యి ఆడియన్స్ షాక్ అవుతారు. అదే పెద్ద ప్లస్ అయ్యింది. ఇదే తరహాలో బాలకృష్ణ పాత సినిమా అశ్వమేధంలో కూడా అమ్రిష్ పూరి పాత్ర డబుల్ యాక్షన్ చేసింది. కాకపోతే ఒకటి చనిపోయాక మరొకటి ఎంటర్ అవుతుంది.

వెంకటేష్ పోకిరి రాజాలో విలన్ గా చేసిన శరత్ బాబు సైతం రెండు పాత్రలలో కనిపిస్తారు. ఇలా కొన్ని ఉదాహరణలు లేకపోలేదు. సో ఇదే కోవలో బాలయ్య సినిమాలో జగపతి బాబు డబుల్ ఫోటో యాక్షన్ విభిన్నంగా ఉండబోతోందన్న మాట. అధికారిక ప్రకటన వచ్చాక మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హీరొయిన్ తో పాటు టెక్నికల్ టీం తదితర వివరాలు బయటికి రావాల్సి ఉంది
Tags:    

Similar News