ఆ పది సినిమాల్లో రుద్రంగి ఒకటవుతుంది..!

Update: 2023-06-30 13:05 GMT
జగపతి బాబు లీడ్ రోల్ లో మమతా మోహన్ దాస్, విమల రామన్ నటించిన సినిమా రుద్రంగి. అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతుండగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. ఈ ఈవెంట్ లో జగపతి బాబు సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని ప్రేక్షకులతో పంచుకున్నారు. దర్శకుడు అజయ్ ఈ కథ తనకు చెప్పినప్పుడు కథ బాగున్నా తాను చేయనని చెప్పానని అన్నారు.

నిర్మాత రసమయి బాలకిషన్ మొండిగా ఈ సినిమా చేయాల్సిందే అని అన్నారు. అందుకే ఈ సినిమా చేశాను. సినిమా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే అయ్యింది అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు.

లెజెండ్ తర్వాత తాను చాలా సినిమాలు చేయగా వాటిలో చెప్పుకోడానికి పది సినిమాలు కూడా లేవు. రుద్రంగి ఆ పది లో ఒకటవుతుందని అన్నారు జగపతి బాబు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు. ఈ సినిమాతో వారందరికీ మంచి గుర్తింపు రావాలని అన్నారు. ఈ సినిమా దర్శకుడు అజయ్ కూడా ఈ సినిమా స్పూరితో మరో 100 సినిమాలు సృష్టించాలని అన్నారు. తన లాంటి ఒక కళాకారుడు ఒక సినిమా తీస్తే దాన్ని ఆశీవర్దించడం కోసం బాలకృష్ణ లాంటి స్టార్ హీరో రావడం కలలా ఉందని నిర్మాత రసమయి బాలకిషన్ అన్నారు.

భవిష్యత్ తరాలకు తెలంగాణా పోరాట స్పూర్తిని తెలియచేయలానే సంకల్పంతో ఈ సినిమా చేశామని అన్నారు. పదేళ్ల కల ఇది.. జగపతి బాబు లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనే ఈ సినిమాకు అన్నీ.. భీమ్ రావ్ దేశ్ముఖ్ పాత్రలో ఆయన అద్భుతంగా చేశారని రసమయి బాలకిషన్ అన్నారు. రుద్రంగి సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న సినిమా.

సినిమాలో మమతా మోహన్ దాస్, విమలా రామన్ లకు పవర్ ఫుల్ రోల్స్ పడినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది జూలై 7న తెలుస్తుంది. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.

Similar News