రీ-రిలీజ్ స‌క్సెస్ అయితే భాస్క‌ర్ మ‌ళ్లీ ఆ కాంపౌండ్ లో!

ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14 న కొన్ని ల‌వ్ స్టోరీలు మ‌ళ్లీ రీ-రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-12 10:30 GMT

ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14 న కొన్ని ల‌వ్ స్టోరీలు మ‌ళ్లీ రీ-రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి ఆరేంజ్. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. మంచి ల‌వ్ స్టోరీగా గుర్తింపు ద‌క్కించుకున్నా క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాలేదు. చ‌ర‌ణ్ ప్యావెర‌ట్ మూవీ ఏది అంటే ఆరేంజ్ పేరు చెబుతాడు. అంత‌గా ఈ సినిమాకి చ‌ర‌ణ్‌క‌నెక్ట్ అయ్యాడు.ఇప్ప‌టికీ అదేమాట చెబుతుంటాడు.

కానీ ఎందుక‌నో వ‌ర్కౌట్ కాలేదంటాడు. అప్ప‌టి జ‌న‌రేష‌న్ కి ఈ సినిమా క‌నెక్ట్ కాలేదు. భాస్క‌ర్ ప్యూచ‌ర్ జ‌న‌రేష‌న్ బేస్ చేసుకుని అడ్వాన్స్ గా తీసి రిలీజ్ చేయ‌డంతోనే వైఫ‌ల్యం చెందింది అన్న‌ది మెజార్టీ వ‌ర్గం భావ‌న. ఈ సినిమాకి అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌కు ల‌ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ్యూజిక‌ల్ గా మాత్రం ఓ సంచ‌ల‌నం అనే చెప్పాలి. హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ తో ఓ మ్యాజిక్ చేసాడు. చర‌ణ్ కెరీర్ కే బెస్ట్ ఆల్బ‌మ్ ఇచ్చాడ‌ని చెప్పాలి.

అయితే ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14 న రీ-రిలీజ్ అవుతుంది. ప్రేమికుల రోజును పుర‌స్క‌రించుకుని ఈ ల‌వ్ స్టోరీని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నారు. ఇలా రీ-రిలీజ్ చేయ‌డానికి ఓ కార‌ణంగా ఉంది. ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాల‌ని రెండేళ్ల‌గా కొంత మంది ఆడియ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అడుగుతున్నారు. ఆ రేంజ్ ఈ టైమ్ లో రిలీజ్ అయి ఉంటే మంచి విజ‌యం సాధించేద‌ని రెండేళ్ల‌గా సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

వాట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే మ‌ళ్లీ రీ-రిలీజ్ చేస్తున్నారు. మ‌రి ఈసారైనా అంచ‌నాల అందుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి. రీచ్ అవ్వ‌డానికైతే ఎక్కువ అవ‌కాశాలున్నాయి. జ‌న‌రేష‌న్ మారింది. ప్రేమ క‌థ‌లు కూడా కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ కంటే పేక్ ల‌వ్ స్టోరీలు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌త్యంలో ఇప్ప‌టి య‌వ‌త‌కి ఆరేంజ్ క‌నెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు. రీ-రిలీజ్ లో స‌క్సెస్ అయితే భాస్క‌ర్ కి మ‌ళ్లీ మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఉండే అవ‌కాశాలున్నాయి. చర‌ణ్ ఛాన్స్ ఇచ్చినా? ఇవ్వ‌క‌పోయినా ఆ కాంపౌండ్ లో యంగ్ హీరోలున్నారు కాబ‌ట్టి! వాళ్ల‌తోనైనా ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News