సుకుమార్ లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ని ఇప్పటిదాకా చూడలేదని అన్నాడు జగపతి బాబు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను అతను అద్భుతంగా మలిచాడని.. తనకు మరపురాని పాత్ర ఇచ్చాడని చెప్పాడు జగపతి. చాన్నాళ్ల తర్వాత తాను నటించాల్సి వచ్చిందని.. అంత స్పెషల్ క్యారెక్టర్ ఇదని జగపతి చెప్పాడు. ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్లో ఆయన ప్రసంగం ఆరంభిస్తుండగా అభిమానులు.. డైలాగులు చెప్పాలని అరిచారు. ఐతే జగపతి మాత్రం ‘‘డైలాగులు చెప్పడానికి ఇది లెజెండ్ సినిమా కాదు. సుకుమార్ సినిమా. వేరే స్టయిల్లో ఉంటుంది’’ అంటూ తన స్పీచ్ కొనసాగించాడు.
‘‘నాన్నకు ప్రేమతో ఆడియో రాత్రి రిలీజైతే పొద్దునే పాటలు పెద్ద హిట్టయిపోయాయి. 2016 బెస్ట్ ఆడియో ఇదే. హ్యాట్సాఫ్ టు దేవి. దేవి ఉంటే సినిమాకే కాదు నాకు కూడా లైఫ్ ఇస్తాడు. ఈ రోజుల్లో నిర్మాతలున్నారు కానీ.. మేకర్స్ తక్కువైపోయారు. ప్రసాద్ గారు ఆ కొద్దిమందిలో ఒకరు. ఆయన పెట్టిన ఫుడ్డుతోనే చచ్చిపోయేట్లున్నాం. డైరెక్టర్ సుకుమార్ ఇంటెలిజెన్స్ ఏంటన్నది డబ్బింగ్ చెబుతున్నపుడు అర్థమైంది. మామూలుగానే నాకు ఇంటెలిజెన్స్ తక్కువ. సుకుమార్ ఆలోచనల్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఇంటెలిజెన్స్ తో పాటు కమర్షియాలిటీని జోడించి సినిమా తీశాడు. ఇలాంటి లక్షణం చాలా కొద్దిమందికే ఉంటుంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. హనుమాన్ జంక్షన్ సినిమా టైంలో సుకుమార్ తో పని చేశా. ‘మీరింకా నాకు హీరోలాగా కనిపిస్తున్నారు. విలన్లాగా ఎలా చూపించాలి’ అని సుక్కు నన్ను అడిగాడు. ఐతే సినిమాలో విలన్ని కూడా హీరోలాగా చూపించాడు.
నేను నిజ జీవితంలో ఎవర్నయితే వెధవ - దరిద్రుడు అంటానో అలాంటి క్యారెక్టర్ నాది. చాలా రోజుల తర్వాత ఈ పాత్ర కోసం నేను నటించాల్సి వచ్చింది. నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్లు నాకోసం మాత్రం ఈ సినిమా చూడొద్దు. చూశారంటే మాత్రం ఈ సచ్చినోడికి డబ్బులు తక్కువైతే మేమిస్తాం కదా అనుకుంటారు. ఇక తారక్ గురించి చెప్పాలంటే.. తన ఎనర్జీ లెవెల్సే వేరు. ఫ్రెండ్షిప్పే వేరు. ఎంతో క్రమశిక్షణ ఉన్న వాడు. యూనిట్ కంటే ముందు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎంత టాలెంటెడో అంత అల్లరి వాడు కూడా. అందరినీ ఆటపట్టిస్తుంటాడు. షూటింగ్ అయ్యాక అందరం ఫాలో ఫాలో అంటూ తన వెంట హోటల్ కు వెళ్లిపోయేవాళ్లం. అక్కడ కూడా తనే మాట్లాడతాడు. మేం వింటుంటాం’’ అన్నాడు జగపతి.