ఏకంగా 50 ల‌క్ష‌లు తీసుకున్నాడట

Update: 2015-09-14 16:29 GMT
వ‌రుస విజ‌యాల‌తో స్వింగుమీదున్నాడు జ‌గ్గూభాయ్ అలియాస్ జ‌గ‌ప‌తిబాబు. హిట్టు హిట్టుకి రేటు పెంచుతున్నాడు. ఓ మెయిన్ హీరో రేంజుకి ఏమాత్రం త‌గ్గ‌కుండా డిమాండ్ చేస్తున్నాడు. కేవ‌లం హీరో అన్న ట్యాగ్ మాత్ర‌మే వ‌దిలిపెట్టాడు కానీ, హీరో గా ఉన్న‌ప్ప‌టి కంటే ఎక్కువే సంపాదించేస్తున్నాడు. లెజెండ్ మొద‌లు శ్రీ‌మంతుడు వ‌ర‌కూ అత‌డి జైత్ర‌యాత్ర‌కు అంతూ ద‌రీ లేదు. అందుకే ఇప్పుడు ఏకంగా 50 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ట‌.. డీటెయిల్స్‌ లోకి వెళితే ..

'లెజెండ్  సినిమాతో విల‌న్‌ గా ట‌ర్న్ అయిన జ‌గ‌ప‌తి బాబు ప్ర‌స్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇటీవ‌లే పిల్లా నువ్వు లేని జీవితంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు.  ఆ వెంట‌నే 'శ్రీమంతుడు  చిత్రంలో  లో మ‌హేష్ కు  తండ్రి పాత్ర పోషించాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో మ‌రోసారి ట‌చ్‌ లో కెళ్లాడు. అక్క‌డ ర‌జ‌నీకాంత్ లింగాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌ తో ఆక‌ట్టుకున్న జ‌గ‌ప‌తిబాబుకు మంచి పేరు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇతర భాషల నుంచి కూడా మంచి  ఆఫర్ లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో కొన్ని సినిమాల్లో నటించారు.

తాజాగా మలయాళ భాష‌లో కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అక్క‌డ‌ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న 'పులి మురుగన్' చిత్రంలో  జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక‌య్యాడు. ప్ర‌తి నాయ‌కుడు ఛాయలున్నా క్యారెక్ట‌ర్ అది. ఇందులో కమలిని ముఖర్జీ -నమిత హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం జగపతి బాబు దాదాపు  50 లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసాడ‌ని స‌మాచారం. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆ రెమ్యున‌రేష‌న్ చాలా ఎక్కువ‌. టాలీవుడ్‌ - కోలీవుడ్‌ తో పోలిస్తే అక్క‌డ పారితోషికాలు చాలా త‌క్కువ‌. కాబ‌ట్టి జ‌గ్గూ భాయ్ పేరు మార్మోగిపోతోంద‌ట.

Tags:    

Similar News