మాజీ మంత్రి కి `జై భీమ్` కౌంట‌ర్

Update: 2021-11-12 08:30 GMT
స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `జైభీమ్` పాజిటివ్ రివ్యూల‌తో ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద‌ పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. బెస్ట్ కంటెంట్ ఉత్తమ న‌ట‌న‌తో సూర్య ఆక‌ట్టుకున్నార‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఓటీటీలో రిలీజైన సినిమా ఊహించ‌నంత పెద్ద‌ విజ‌యాన్ని అందుకుంది. అదే ఇలాంటి చిత్రం థియేట‌ర్లో రిలీజ్ అయింతే ఇంకా గొప్ప పేరొచ్చేది. అణ‌గారిన వ‌ర్గాల‌పై పోలీసు దౌర్జ‌న్యాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ఈ చిత్రంలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. గుర్తింపు లేని కుల‌స్తుల‌పై అమాన‌వీయం.. నిమ్న కులాల‌పై దాడులు ఎలా ఉంటాయి? అన్న‌ది ఆద్యంతం తెర‌పై ఆస‌క్తిక‌రంగా మ‌లిచిన తీరు అభినంద‌నీయం. అయితే ఈ సినిమా పై ఎలాంటి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నా కానీ..అక్క‌డ‌క్కడా విమ‌ర్శ‌లు కూడా ఎదుర‌వుతున్నాయి.

మాజీ మంత్రి అన్బుమ‌ణి రాందాస్ సినిమాపై ఓ లేఖ రూపంలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసారు. సినిమాలో పోలీసు వ్య‌వ‌స్థ‌ను త‌ప్పు బ‌ట్ట‌డంపై రాందాస్ విమ‌ర్శ‌లు చేసారు. సూర్య రాందాస్ సంధించిన ప్ర‌శ్నిల‌న్నింటికి అదే లేఖ రూపంలో స‌మాధానాలు పంపించారు. ఏ వ్య‌క్తి లేదా.. స‌మాజం మ‌నోభావాలు దెబ్బ‌తీసే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఆనాటి ప‌రిస్థితుల్ని..జ‌రిగిన వాస్త‌వాల్ని మాత్ర‌మే చూపించాం. పోలీసుల్ని..పోలీసు వ్య‌వ‌స్థ‌ని ఎక్క‌డా త‌ప్పుగా చూపించ‌లేద‌ని.. ఆ ఉద్దేశం త‌మ‌ది కానే కాద‌ని తెలిపారు.

పోలీసుల్ని క్రూరంగా చూపించడం ప‌ట్ల రాందాస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. అలాగే స‌మాజాన్ని అవ‌మానించార‌ని...సినిమాలో పాత్ర‌ల పేర్లు నిజ‌జీవితంలో పాత్ర‌ల‌కు దగ్గ‌ర‌గా ఉన్నాయ‌ని.. పోలీసు అధికారి పేరు మార్చాల‌ని... చాలా స‌న్నివేశాలు మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని రాందాస్ ఆరోపించారు. మ‌రి వాటికి ఎలాంటి స‌మాధానాలు సూర్య ఇచ్చారు అన్న‌ది తేలాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Tags:    

Similar News