ఆస్కార్ అంతటి అవార్డుకు మన సినిమా నామినేట్‌

Update: 2021-11-30 04:29 GMT
సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఆస్కార్. హాలీవుడ్ సినిమాలు ఆస్కార్ అవార్డుతో పాటు అత్యున్నత అవార్డుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును పరిగనిస్తూ ఉంటారు. ఆస్కార్ స్థాయి గుర్తింపు మరియు పబ్లిసిటీ ఉండే గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవాలని కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ కళా కారులు మరియు సాంకేతిక నిపుణులు కోరుకుంటూ ఉంటారు. హాలీవుడ్‌ సినిమాలతో పాటు కొరియన్‌ మరియు ఇతర విదేశీ భాషల సినిమాలకు మాత్రమే ఈ అవార్డులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇండియన్ మూవీస్ పలు సార్లు నామినేట్‌ అయినా కూడా అవార్డును మాత్రం దక్కించుకోలేక పోయాయి. తాజాగా మరోసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు గాను మన ఇండియన్ సినిమా నామినేట్ అయ్యింది. సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.

సూర్య హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన జై భీమ్ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అద్బుతమైన సినిమా అంటూ ప్రతి ఒక్కరితో అనిపించుకున్న జై భీమ్ కు ఖచ్చితంగా ఆస్కార్‌ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఆస్కార్‌ రేంజ్ నటన తో పాటు మంచి కాన్సెప్ట్‌ కూడా అవ్వడం వల్ల ఈ సినిమాకు ఎన్నో అవార్డులు మరియు రివార్డులు రాబోతున్నట్లుగా సూర్య అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా అందుకోబోతున్నట్లుగా విశ్లేషకులు కూడా నమ్మకంగా చెబుతున్న సమయంలో గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుకు నామినేట్‌ అవ్వడం ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఇది మన సినిమా అనేట్లుగా జై భీమ్ ఉంది.. ప్రతి ఒక్కరు గర్వించేలా అంతర్జాతీయ వేదికపై జై భీమ్‌ యూనిట్‌ సభ్యులు అవార్డులు అందుకోబోతున్నారు. జై భీమ్ లోని ప్రతి పాత్ర కూడా అద్బుతంగా పండింది. చిన్న చిన్న ఎలిమెంట్స్ ను కూడా మిస్ అవ్వకుండా దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా అన్ని విషయాల్లో కూడా అవార్డుకు అర్హం అనడంలో సందేహం లేదు. అమెజాన్ ఓటీటీ ద్వారా విడుదల అయిన ఈ సినిమా అత్యధిక వ్యూస్ ను రన్ టైమ్‌ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. జై భీమ్ సినిమా థియేటర్‌ రిలీజ్ అయ్యి ఉంటే వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.



Tags:    

Similar News