సూపర్ స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తై' తో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో పరాజయాలతో తర్వాత రజనీ అందుకున్న సక్సెస్ ఇది. దీంతో తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వంలో కమిట్ అయ్యారు.
ఆ సినిమాకి 'జైలర్' అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. కానీ నెల్సన్ తెరకెక్కించిన 'బీస్ట్' పరాజయం నేపథ్యంలో రజనీ ఆలోచనలో పడినట్లు కనిపించారు. 'జైలర్' కథ విషయంలో సందేహాలు నివృత్తి కోసం కొంత సమయం తీసుకున్నారు. స్ర్కిప్ట్ లో అవసరమైన మార్పులు..చేర్పులు సూచించారు రజనీ. ఈ క్రమంలో కొంత సమయం నెల్సన్ స్ర్కిప్ట్ కోసం కేటాయించాల్సి వచ్చింది.
ఫైనల్ గా తాజాగా స్ర్కిప్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కి అనుకూలంగా స్ర్కిప్ట్ లో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ ఫైనల్ వెర్షన్ స్ర్కిప్ట్ ని రజనీకి వినిపిస్తున్నారుట. దాదాపు ఒకే అయినట్లేనని సమాచారం.
రజనీ మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని సమాచారం. టైటిల్ ని బట్టి రజనీ 'జైలర్' పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా షూటింగ్ ని ఆగస్టు రెండో వారం నుంచి హైదరాబాద్ లోనే ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారుట.దీనిలో భాగంగా రామోజీ పిలిం సిటీలో 'జైలర్' కోసం ప్రత్యేకంగా భారీ సెట్ల నిర్మాణం చేపడుతున్నారుట. రెగ్యులర్ షూటింగ్ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ మొత్తం రజనీ..ఇతర కీలక పాత్రధారులపైనే సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు.
ఈ షెడ్యూల్ అనంతరం చెన్నై..పూణే లో షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఐశ్వర్యారాయ్ జాయిన్ అవుతుందని సమాచారం. మరో హీరోయిన్ గా ప్రియాంక మోహనన్ నటిస్తుంది. ఇంకా సినిమాలో శివరాజ్ కుమార్.. శివ కార్తికేయన్..రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాని టెక్నికల్ గానూ హైస్టాండర్స్డ్ లో మలుస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుంది.