మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ రేంజికి చేరిపోయింది. రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ముందు సినిమాకు ఏవరేజ్.. డివైడ్ టాక్ వచ్చినా.. సినిమా ఈ స్థాయికి రావడం గొప్ప విషయమే. మంచి టైమింగ్ లో రిలీజవడం ఒకరకంగా సినిమాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ బాగానే ఆడింది ‘జనతా గ్యారేజ్’. ఐతే ఒక విషయంలో మాత్రం ‘జనతా గ్యారేజ్’ ఫెయిలైంది. ఈ సినిమా ఎన్టీఆర్ పొరుగు మార్కెట్లలో గేట్లు తెరుస్తుందని ఆశించారంతా. ముఖ్యంగా మలయాళంలో తారక్ నోటబుల్ హీరో అయిపోతాడని అనుకున్నారు. అల్లు అర్జున్ కు అతడి నుంచి గట్టి పోటీ ఉందని అంచనా వేశారు. ఐతే అంచనాలు ఫలించలేదు.
‘జనతా గ్యారేజ్’ మలయాళంలో అనుకున్న స్థాయిలో ఆడలేదు. మోహన్ లాల్ ను ముందు పెట్టి ‘జనతా గ్యారేజ్’ను బాగా ప్రమోట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నామమాత్రపు వసూళ్లే సాధించింది. మోహన్ లాల్ సినిమా అన్నట్లు ప్రచారం చేసినా.. సినిమాలో ఆయనది కీలక పాత్ర అయినా.. ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పోస్టర్లలో ప్రధానంగా మోహన్ లాలే కనిపించినా.. సినిమాలో ఎన్టీఆర్ ది కీలక పాత్ర కాబట్టి మలయాళ ప్రేక్షకులు అతణ్ని బాగా గుర్తు పెట్టుకుంటారని.. మున్ముందు అతడి సినిమాలకు అది బాగా కలిసొస్తుందని అనుకుంటే.. అక్కడ ఎన్టీఆర్ గురించి పెద్దగా చర్చ జరిగినట్లుగా కనిపించడం లేదు. మొత్తానికి అల్లు అర్జున్ చాలా సినిమాలతో సాధించింది ఎన్టీఆర్ ఒకే సినిమాతో సాధిస్తాడని అనుకుంటే.. అంచనాలు తిరగబడ్డాయి.