అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయలు..అక్కాచెల్లెళ్లు జాన్వీకపూర్..ఖుషీ కపూర్ గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటికే జాన్వీ అమ్మ వారసత్వంతో నటిగా తెరంగేట్రం చేసి దూసుకుపోతుంది. తండ్రి బోనీకపూర్ సూచనలు..సలహాలు పాటిస్తూ టాప్లీగ్ లో చేరే ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తోంది. కథా బలం ఉన్న చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది.
నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని చాటుకునే కథల కోసం సెర్చ్ చేస్తోంది. మరోవైపు దక్షిణాదిన తన సినిమాల్ని సీరియస్ గానే ప్రమోట్ చేస్తుంది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా లో ఫేమస్ అవుతోన్న నేపథ్యంలో ఇక్కడ ఇండస్ర్టీపైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.మహేష్..చరణ్ లాంటి స్టార్లు పిలిచి ఛాన్స్ ఇవ్వాలే గానీ నటించడానికి రెడీగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చేసింది.
ఇక చెల్లి ఖుషీ కపూర్ ఇంకా తెర వెనుకే ఉంది. నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా సమయం ఉందంటూ వెయిట్ చేస్తోంది. అయితే అంతకన్నా ముందే అక్కని బాలీవుడ్ లో ఫేమస్ చేయాలని తనవంతుగా చేయాల్సిన వాటన్నింటిని చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫ్యాషన్..స్టైలింగ్ లాంటి విషయాల్లో మీకు స్పూర్తి ఎవరంటే? జాన్వీ ఠకీమని ఖుషీ కపూర్ పేరు చెప్పింది.
స్టైలింగ్ లో తన అభిరుచి ఎక్కువగా నచ్చుతుందిట. తన స్టైలింగ్ కి సంబంధించి అన్ని విషయాలు జాన్వీనే దగ్గరుండి చూసుకుంటుందిట. తాను ఏది ధరించినా వెంటనే రివ్యూ ఇచ్చేది ఖుషీనే అంట. కొత్త దుస్తులు ధరించినప్పుడు దూరంగా ఉన్నా సెల్పీ చెల్లికి పంపించి మీరి ఎలా ఉన్ అని అడిగి తెలుసుకుంటుందట. అలాగే శ్రీదేవికి కూడా డ్రెస్ అప్ అవ్వడంపై చాలా శ్రద్దు చూపించేవారుట.
అలంకరణ రూమ్ నుంచి బయటకు రావడానికి గంటల సమయం పట్టేదట. ముఖ్యంగా సెట్స్ కి వెళ్లే ముందు శ్రీదేవి అలంకరణ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. అమ్మని చూసే అక్కాచెల్లెళ్లు ఇద్దరు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆరకంగా శ్రీదేవి ప్రేక్షకుల మధ్యలో లేపోయినా ఆమె జ్ఞాపకాలు..మధుర స్మృతులను కుమార్తెల రూపంలో ఎప్పుడూ ప్రేక్షకులు చూసుకుంటూనే ఉంటారు.