వీడియో : ప్రియుడితో మీడియా కంట పడ్డ జాన్వీ.. ముఖాన్ని దాచుకుంది

Update: 2023-01-05 07:31 GMT
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ గా ఇప్పటి వరకు కమర్షియల్‌ గా భారీ విజయాలను దక్కించుకోలేక పోయిన జాన్వీ కపూర్‌ అతి త్వరలోనే తెలుగు లో కూడా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే జాన్వీ కపూర్‌ యొక్క తెలుగు సినిమాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక జాన్వీ కపూర్‌ గత కొంత కాలంగా శిఖర్‌ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఇద్దరు కొన్నాళ్ల పాటు కనిపించక పోవడంతో జాన్వీ కపూర్‌ మరియు శిఖర్‌ ల ప్రేమ విషయం మీడియాలో పెద్దగా సందడి చేయలేదు. కానీ మళ్లీ వీరిద్దరు కలిసి కనిపించడంతో వీరి ప్రేమ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చినట్లు అయ్యింది.

తాజాగా రియా ఇంటికి ఒకే కారులో జాన్వీ మరియు శిఖర్ లు కలిసి వచ్చారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్స్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె తన ఫేస్ ను దాచుకునేందుకు ప్రయత్నించింది. అంతే కాకుండా ఆమె శిఖర్ వైపు చూస్తూ సిగ్గు పడింది. ప్రస్తుతం వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చూపించి కెమెరా వైపు చూడాల్సిందిగా ఎంతగా అడిగినా ఆమె మాత్రం నిరాకరించింది. శిఖర్ ఆ మధ్య ఒక ఫ్యామిలీ కార్యక్రమంలో బోనీ కపూర్ ను కూడా కలిశాడు. అప్పుడు శిఖర్ బుజం పై బోనీ కపూర్‌ చేయి వేసి మాట్లాడిన ఫొటోలు మరియు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో తో శిఖర్ మరియు జాన్వీ లు ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్‌ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News