జాన్వీకి కాబోయేవాడు బోనీక‌పూర్ క‌న్నా ఎత్తుండాలి!

Update: 2022-07-29 12:30 GMT
కపూర్ వార‌సురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీక‌పూర్ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కుర్ర భామ‌ల్లో జాన్వీ క్రేజ్ ఎంతో ప్రత్యేకం. అతిలోక సంద‌రి శ్రీదేవి కుమార్తె కావ‌డం...బోనీ కపూర్ ముద్దుల త‌న‌య కావ‌డం జాన్వీని బాలీవుడ్ ఆ స్థాయిలో నిలబెట్టాయి.  హీరోయిన్ గా రాణిస్తూనే ...ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌కు సైతం అనతి కాలంలోనే ప్ర‌మోట్ అయింది.

బ్యాకప్  తో పాటు..ట్యాలెంట్ రెండు ఉండ‌టంతోనే జాన్వీ ఆ ఫీట్ ని సాధించ‌గ‌ల్గింది. త్వ‌ర‌లో ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో సైతం అడుగు పెట్ట‌డానికి రెడీ అవుతోంది. కాల‌క్ర‌మేణా త‌ల్లి త‌ర‌హాలో అన్ని భాష‌ల్లో న‌టించే ప్లానింగ్ క‌నిపిస్తుంది. దానికి సంబంధించిన ప‌క్కా ప్లానింగ్ తండ్రి బోనీ క‌పూర్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతోంది. జాన్వీ స‌క్సెస్ వెనుక తండ్రి పాత్ర ఆది నుంచో ఎంతో కీల‌కంగానే ఉంది.

త‌ల్లి దూర‌మైన దగ్గ‌ర‌ నుంచి అన్నీతానై చూసుకుంటున్నారు. మ‌రి వృత్తిప‌రంగా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోన్న బోనీ క‌పూర్ కాబోయే అల్లుడి విష‌యంలో ఇంకెంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. తండ్రి మ‌న‌సును అర్దం చేసుకున్న  జాన్వీ కూడా బోనీ మాట‌ని జావ‌దాట‌ను అంటోంది. కాబోయే వాడు ఎలా ఉన్నా  బోనీకి ప‌ర్వాలేదంట‌.

ఆ విష‌యంలో పూర్తి స్వేచ్ఛ‌ జాన్వీకి ఇచ్చేసారు. కానీ ఒక్క విష‌యంలో మాత్రం రాజీ ప‌డేదే లేద‌ని బోనీ క‌పూర్ తెగేసి చెప్పేసారుట‌. 'జాన్వీ పెళ్లి చేసుకునేవాడు బోనీ క‌పూర్ క‌న్నా ఎత్తుగా ఉండాలి. బోనీ ఎత్తు 6.1 అడుగుల ఎత్తు అని జాన్వీ చెప్పి న‌వ్వుకుంది. బోనీ మ‌రో మాట కూడా కూతుళ్ల‌తో చెప్పారంట‌.

''జాన్వీ..ఖుషీ మీ భ‌ర్త‌ల‌తో ఒక‌టే చెప్పండి. మా నాన్న ప్ర‌పంచం మొత్తం తిప్పి చూపించాడు అని..అంటే  నా భ‌ర్త న‌న్ను ఇంకెంత బాగా చూసుకోవాలో?  నాన్న చెప్ప‌క‌నే చెప్పార‌ని జాన్వీ తెలిపింది.

అంటే జాన్వీ..ఖుషీ ఇద్ద‌రు  కాబోయే వాడి అందం విష‌యంలో ఎలా ఉన్నా త‌ప్ప‌ని స‌రిగా 6.1 అడుగులు కంటే ఎక్కువ ఎత్తు ఉన్న‌వాడ్నే భ‌ర్త గా అంగీక‌రించాలి.  ప్రేమ‌లో ప‌డితే మాత్రం..కాబోయే వాడికి  ఈ హైట్ త‌ప్ప‌నిస‌రి.  లేకుంటే బోనీ క‌పూర్ నే హైట్ ఉన్న‌వాడిని చూసి వెత‌కాలి.
Tags:    

Similar News