అతిలోక సుందరి శ్రీదేవి తెలుగింటి ఆడపడుచుగా ప్రసిద్ధి. సాంప్రదాయ చీరకట్టులో ముస్తాబైతే శ్రీదేవి ఎంత అందంగా ఉంటుందో వర్ణించడమే ఆసాధ్యం. బాలీవుడ్ లో స్థిరపడినా పుట్టినిల్లంటే శ్రీదేవికి ఎంతో అభిమానం చూపించేవారు. ఆ కారణంతో బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా తెలుగులోనూ సినిమాలు చేస్తుండేవారు. అలా తెలుగింట అమ్మాయిగా పుట్టినిల్లు రుణం తీర్చుకునేవారు. తాజాగా అతిలోక సుందరి కుమార్తెలిద్దరిని చూస్తుంటే మేటి అందం మళ్లీ గుర్తొచ్చింది. అవును దివాళీ సందర్భంగా జాన్వీకపూర్..ఖుషీ కపూర్ లంగావోణీలు ధరించి తెలుగు సంప్రదయాన్ని గుర్తు చేసారు. జాన్వీ పట్టు పరికిణి..నీలం రంగు పైటంచు ధరించింది.
ఆ చీరకట్టుకు తగ్గట్టుగానే మల్లెచెండును జడలో తురిమి ముఖంలో చిన్న చిరునవ్వు చెదరకుండా కపూర్ సిస్టర్స్ హొయలు ఒలికించారు. ఆ రూపంలో జాన్వీ అచ్చంగా తల్లి శ్రీదేవిని మరిపిస్తోంది. ఖుషీ కపూర్ కూడా అక్కలాగే ముస్తాబైంది. లక్ష్మీపూజ సమయంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇలా రెడీ అయ్యారు. మరి ఈ క్రెడిట్ అంతా ఎవరికి? అంటే కచ్చితంగా తండ్రి బోనీకపూర్ కే ఇవ్వాలేమే. ఆయన సలహా మేరకు ఖుషీ..జాన్వీ ఇలా తయారయ్యారట.. భార్య శ్రీదేవి అంటే బోనీ కపూర్ కి ఎంతో ఇష్టం. కుమార్తెలు ఇద్దరిని తల్లి లేని లోటు తెలియనీకుండా సాకుతున్నారు. బాలీవుడ్ లో కథానాయికలుగా మంచి భవిష్యత్ ని తీర్చిదిద్దే బాధ్యతను బోనీ తీసుకున్నారు.
కూతుళ్లను స్టార్లుగా తీర్చిదిద్దుతూనే.. విలువలుతో పెంచుతున్నారు. సిస్టర్స్ సంప్రదాయ దుస్తులు ధరించాలని సందర్భానికి తగ్గట్టు బోనీ సూచించారట. జాన్వీ తన ఇన్ స్టా లో ఈ ఫోటోల్ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. తరుచూ ఫ్యాషనిష్టాలు గా కనిపించే అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇలా ట్రెడీషనల్ అవతార్ లో కనిపించడంతో అభిమానులు సోషల్ మీడియాల్లో ఆసక్తిర కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. ఇక జాన్వీ బాలీవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషీ త్వరలోనే ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.