ఇన్ స్టాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన జాన్వీ

Update: 2022-12-21 06:31 GMT
అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో ఏ రేంజ్కి చేరుకుందో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ల్లి లేక‌పోయినా పిల్ల బాలీవుడ్ ని ఏల్తోంది. హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ జోడీగా నిలిచింది. బ‌యోపిక్ ల్లో  సైతం న‌టిస్తూ జాన్వీ  స‌త్తా చాటుతోంది.

ఇక బ్యూటీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీదేవి కుమార్తెగా తెరంగేట్రానికి ముందే నెట్టింట ఫేమ‌స్ అయింది. అటుపై న‌టిగా మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం అమ్మ‌డి ఫాలోవ‌ర్స్  21 మిలియ‌న్స్ ఉన్నారు. ఇలా ఇంత మంది ఫాలోవ‌ర్స్ ని సంపాదించ‌డం కోసం జాన్వీ ఎంతో శ్ర‌మించింద‌ని చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్ప‌డు కొత్త ఫోటోల‌తో కాక‌లు పుట్టించ‌డంతోనే ఇది సాధ్య‌మైంది.

ఫ్యాష‌న్ ఎంపిక‌ల ప‌ట్ల త‌న అభిరుచిని చాటుతూ త‌నేంటే నిరూపించుకుంది. ఈ నేప‌థ్యంలోనే భారీ ఫాలోయింగ్  ద‌క్కించుకుంది. అయితే తాజాగా ఈ ఫాలోయింగ్ పై జాన్వీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ ర‌క‌మైన ఫాలోయింగ్ త‌న సినీ కెరీర్ కి ఎలాంటి ఉప‌యోగం లేద‌ని పేర్కోంది.

రెండింటిని వేరుగా చూడాల్సిన అంశమ‌ని అంటోంది. నిజంగా మీరు చెప్పిన‌ట్లు 21 మిలియ‌న్ మంది నేను న‌టించిన 'మిలీ' సినిమా చూసి ఉంటే అది పెద్ద హిట్ అయ్యేది క‌దా.

మ‌రి ఆ సినిమా పోయిందంటే? దానికి కార‌ణం వాళ్లు అనే అనుకోవాలా? అలా అనుకుంటే అది పెద్ద త‌ప్పు అవుతుంది. నన్ను సోష‌ల్మీడియాలో ఫాలో అయ్యే వారంతా నా సినిమాలు చూడాల‌ని లేదు !  క‌దా?  అనేసింది. నిజ‌మే జాన్వీ చాలా తెలివైన స‌మాధాన‌మే ఇచ్చింది. హీరోలంద‌రికి కోట్ల‌లో ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లంతా న‌టించిన సినిమాలు వీళ్లంతా చూస్తే ప్ర‌తీ సినిమా హిట్ త‌ప్ప‌..ప్లాప్ అవ్వ‌దు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News