అతి లోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అతిలోక సుందరి అభిమానులకు దీనిపై క్లారిటీ మిస్సయ్యింది. జాన్వీ తెలుగు సినిమాల్లో లాంచ్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చాలా కాలంగా మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. కొందరు టాలీవుడ్ దర్శక..నిర్మాతలు సైతం జాన్వీని లాంచ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నించారని టాక్ వినిపించింది. స్క్రిప్ట్ పరంగా ఏదీ నచ్చకపోవడం వల్లనే జాన్వీ ఆసక్తి చూపించలేదని కూడా ప్రచారమైంది. కారణం ఏదైనా ఇన్నాళ్లు జాన్వీ ఎంట్రీ ఆలస్యమైంది. అయితే తాజా అప్ డేట్ ప్రకారం జాన్వీ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. జాన్వీ కెరీర్ మొత్తాన్ని పక్కా ప్రణాళికతో తండ్రి బోనీ కపూర్ ముందే డిజైన్ చేసారని అదే బాటలో జాన్వీ వెళుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ముందు అక్కడ పెద్ద స్టార్ గా ఎదిగిన తర్వాతే మిగతా భాషలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేసినట్లు గుసగుస వినిపిస్తోంది. జాన్వీ బాలీవుడ్ కెరీర్ ప్రారంభమై ఇప్పటికే మూడేళ్లు అయింది. యువ హీరోలకు జోడీగానే నటిస్తోంది. నటిగా బిజీగా ఉన్నా పరిపూర్ణ నటిగా ఇంకా ఎదగలేదు. అక్కడ దీపికా పదుకొణే.. ఆలియాభట్ వంటి స్టార్ హీరోయిన్ లకు ధీటుగా ఎదగాలంటే అంత ఈజీ కాదు. జాన్వీ అంటే ఓ బ్రాండ్ అనే ముద్ర పడాల్సి ఉంది. ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న తర్వాత ఇతర భాషల్లో లాంచ్ చేయించాలని..అప్పటివరకూ రెండు పడవల ప్రయాణం అనవసర ప్రాయాస తప్ప సాధించేది ఏమీ ఉండదని బోనీ కపూర్ సైతం సజ్జెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
తన భార్య స్థానంలో కుమార్తెని అన్ని భాషల్లోనూ నిలబెట్టాలని దానికి తగ్గ ప్రణాళిక బోనీకపూర్ వద్ద పక్కాగా ఉందన్నది బాలీవుడ్ మీడియా టాక్. బాలీవుడ్ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు రెండవ కేంద్రంగా టాలీవుడ్ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో బోనీకపూర్ ఇక్కడి నిర్మాతలు..పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో టైఅప్ అయి సినిమాలు నిర్మించడానకి ఆసక్తి చూపిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడి సినిమాల్ని ఇక్కడికి..ఇక్కడ సక్సెస్ ల్ని అక్కడ రీమేక్ చేసి నిర్మాతగా మరింత సక్సెస్ చూడాలని బోనీ కపూర్ ప్లాన్ చేసారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. తాను నిర్మాతగా కొనసాగుతూనే కూతుళ్లకు ఇక్కడ అవకాశాల్ని ఒడిసిపట్టే డ్యూయల్ మాస్టర్ ప్లాన్ అతడి వద్ద ఉందిట. జాన్వీ తర్వాత శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా సినీఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషీ కోసం బోనీ పాపా పక్కా ప్రణాళికతో ఉన్నారు.