స్టార్‌ కిడ్ కి ఈ రీమేక్‌ ఐనా సక్సెస్‌ తెచ్చి పెట్టేనా?

Update: 2022-10-12 11:27 GMT
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఆమె కమర్షియల్‌ హీరోయిన్ గా సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. మొదటి సినిమా మరాఠీ సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా నటిగా జాన్వీ కి మంచి పేరును తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఆ తర్వాత బయోపిక్ లో నటించింది. ఆ సినిమా లో జాన్వీ నటనకు కొందరు విమర్శలు చేస్తే మరి కొందరు పర్వాలేదు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తమిళ సినిమా ను రీమేక్ చేసింది. నయనతార పోషించిన పాత్రను హిందీలో జాన్వీ కపూర్‌ చేసి చాలా పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఆ రీమేక్ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఇప్పుడు మరో రీమేక్ ను జాన్వీ కపూర్‌ చేసింది. ఈసారి మలయాళ సూపర్ హిట్‌ మూవీ హెలెన్ కి అధికారిక రీమేక్ గా జాన్వీ కపూర్‌ 'మిలీ' అనే టైటిల్‌ తో రూపొందిన చిత్రంలో నటించింది. ఈ సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా హిందీలో కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమా ను జాన్వీ కపూర్‌ తండ్రి అయిన బోణీ కపూర్‌ నిర్మించాడు. కనుక ఈ సినిమా కపూర్‌ ఫ్యామిలీకి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. మిలీ సినిమా ను నవంబర్ 4వ తారీకున ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

మరో నెల రోజుల సమయం కూడా విడుదలకు సమయం లేదు. దాంతో జాన్వీ కపూర్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను షురు చేయబోతున్నారు. తాజా పోస్టర్‌ నుండి మొదలుకుని ఆ తర్వాత టీజర్.. ట్రైలర్‌.. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహించబోతున్నారట. మరి ఈ రీమేక్ తో అయినా జాన్వీ కపూర్ కి కమర్షియల్‌ గా బ్రేక్ దక్కేనా చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News